బ్రిటన్‌ ఎన్నికల్లో ‘ఏఐ’ అభ్యర్థి ఓటమి

బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో కృత్రిమ మేధ (ఏఐ) కూడా బరిలో నిలిచింది. ‘ఏఐ స్టీవ్‌’ పేరిట ప్రజల నుంచి ఓట్లను కోరింది.

Published : 06 Jul 2024 04:09 IST

లండన్‌: బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో కృత్రిమ మేధ (ఏఐ) కూడా బరిలో నిలిచింది. ‘ఏఐ స్టీవ్‌’ పేరిట ప్రజల నుంచి ఓట్లను కోరింది. 179 మంది మాత్రమే ఆ అభ్యర్థికి ఓటువేశారు. దాంతో బ్రైటన్‌ పెవిలియన్‌ నియోజకవర్గంలో చివరి స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. వర్చువల్‌ అసిస్టెంట్లు, ఆటోమేటెడ్‌ కస్టమర్‌ సర్వీస్‌ ఏజెంట్ల నుంచి న్యూస్‌ యాంకర్లు, వర్చువల్‌ టీచర్ల వరకు ఈ కృత్రిమ మేధ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే వ్యాపారవేత్త స్టీవ్‌ కాట్‌కు తన స్థానంలో ఏఐ అభ్యర్థిని నిలబెట్టాలనే ఆలోచన వచ్చింది. దీంతో తన ఫొటో సాయంతో రూపొందించిన ‘ఏఐ అవతార్‌’ను వినియోగించారు. ‘ఏఐ స్టీవ్‌’ పేరుతో నామినేషన్‌ సమర్పించి ఎన్నికల బరిలోకి దిగారు. ఈ వర్చువల్‌ అభ్యర్థి కాట్‌ తరపున నిల్చుంది. ప్రచారంలో పాల్గొంది. బ్రిటన్‌ ఎన్నికల్లో పోటీ చేసిన తొలి వర్చువల్‌ అభ్యర్థిగా ఏఐ స్టీవ్‌ చరిత్ర సృష్టించినప్పటికీ.. ఓటర్లను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని