చీకట్లలో లక్ష మంది ఉక్రెయిన్‌ వాసులు

ఉత్తర ఉక్రెయిన్‌లోని సుమి ప్రావిన్సును రష్యా వైమానిక దాడులు అంధకారం చేశాయి. శుక్రవారం రాత్రి విద్యుత్కేంద్రాలే లక్ష్యంగా మాస్కో చేసిన దాడులతో ఆ నగరంలో దాదాపు లక్ష మంది చీకట్లలో మగ్గుతున్నారు.

Published : 07 Jul 2024 04:18 IST

విద్యుత్కేంద్రాలే లక్ష్యంగా రష్యా వైమానిక దాడులు

కీవ్‌: ఉత్తర ఉక్రెయిన్‌లోని సుమి ప్రావిన్సును రష్యా వైమానిక దాడులు అంధకారం చేశాయి. శుక్రవారం రాత్రి విద్యుత్కేంద్రాలే లక్ష్యంగా మాస్కో చేసిన దాడులతో ఆ నగరంలో దాదాపు లక్ష మంది చీకట్లలో మగ్గుతున్నారు. అంతేకాదు.. సుమి ప్రావిన్సు రాజధానైన సుమికి నీటి సరఫరా కూడా నిలిచిపోయింది. ‘‘యుద్ధం మధ్యలో ఉన్నాం. రష్యా ఉగ్రవాదులకు మా ఇంధన రంగమే ప్రధాన లక్ష్యం. ఎందుకంటే మా జీవితం, మా నాగరికత విద్యుత్‌పైనే ఆధారపడి ఉంది. స్వేచ్ఛ కోసం ఇది మేం చెల్లిస్తున్న మూల్యం’’ అని ఉక్రెయిన్‌ ఇంధన సంస్థ ఉక్రెనెర్జో అధిపతి మారియా సెట్యూరియన్‌ తెలిపారు. దొనెట్క్స్‌ ప్రాంతంలో రష్యా శతఘ్ని దాడుల్లో 11 మంది పౌరులు మృతి చెందారని, 43 మందికి గాయాలయ్యాయని స్థానిక గవర్నర్‌ తెలిపారు. మొత్తం వేర్వేరు ప్రాంతాల్లో ఆరు రాకెట్‌ దాడులు, 55 వైమానిక దాడులు రష్యా జరిపిందని ఉక్రెయిన్‌ సైన్యం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని