కీలక డిమాండ్‌పై హమాస్‌ వెనక్కి

గాజాలో యుద్ధాన్ని ఇజ్రాయెల్‌ శాశ్వతంగా ముగిస్తేనే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తామని చెబుతున్న హమాస్‌.. ఆ కీలక డిమాండ్‌పై వెనక్కి తగ్గింది.

Published : 07 Jul 2024 04:26 IST

డెయిర్‌-అల్‌-బలా: గాజాలో యుద్ధాన్ని ఇజ్రాయెల్‌ శాశ్వతంగా ముగిస్తేనే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తామని చెబుతున్న హమాస్‌.. ఆ కీలక డిమాండ్‌పై వెనక్కి తగ్గింది. దీంతో అమెరికా మద్దతిస్తున్న మూడు దశల కాల్పుల విరమణకు మార్గం సుగమమైనట్లే కనిపిస్తోందని ఓ ఈజిప్టు అధికారి, హమాస్‌ ప్రతినిధి తెలిపారు. వాస్తవానికి ఈ కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇజ్రాయెలే చేసింది. అయితే శాశ్వతంగా యుద్ధం ముగిస్తామన్న హామీకి మాత్రం తాము కట్టుబడబోమని పేర్కొంది. దీంతో కాల్పుల విరమణ చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. 

పాఠశాలపై బాంబుల వర్షం..  15 మంది మృతి

కాల్పుల విరమణ చర్చల్లో ఓవైపు పురోగతి కనిపిస్తున్నా, గాజాలో బాంబుల వర్షం మాత్రం ఆగలేదు. శనివారం సెంట్రల్‌ గాజాలోని నజీరత్‌ వద్ద శరణార్థులు ఉంటున్న ఓ పాఠశాల భవనంపై ఇజ్రాయెల్‌ జరిపిన క్షిపణి దాడిలో 15 మంది మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. మరో మూడుచోట్లా ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో  మరో 12 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఐదుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలతోపాటు ఐక్యరాజ్యసమితి సిబ్బంది కూడా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు