అమెరికాలో కాల్పులు.. నలుగురి మృతి

అమెరికాలోని కెంటకీ ఉత్తర ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. అనంతరం నిందితుడు పారిపోతుండగా పోలీసులు వాహనాన్ని వెంబడించారు.

Published : 07 Jul 2024 04:32 IST

ఫ్లోరెన్స్‌: అమెరికాలోని కెంటకీ ఉత్తర ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. అనంతరం నిందితుడు పారిపోతుండగా పోలీసులు వాహనాన్ని వెంబడించారు. దీంతో నిందితుడు కారుతో సహా గోతిలో పడి మరణించాడు. శనివారం 2.50 గంటల సమయంలో ఫ్లోరెన్స్‌లో కాల్పులు చోటుచేసుకున్నాయి. సమాచారం అందుకుని వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులకు ఏడుగురు బాధితులు కనిపించారు. వారిలో నలుగురు అప్పటికే మరణించారు. గాయపడిన ముగ్గురిని సిన్సినాటిలోని ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పారిపోతుండగా పోలీసులు వెంబడించారు. దీంతో అతడు కారుతోసహా గోతిలో పడ్డాడు. అప్పటికే అతడు కాల్చుకుని చనిపోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని