పర్యావరణంలోని టాక్సిన్లతో మానసిక కుంగుబాటు

వాతావరణంలో సాధారణంగా కనిపించే విషతుల్య పదార్థాల (టాక్సిన్లు)తో నిరాశావాదం, రోజువారీ కార్యక్రమాలపై పెద్దగా ఆసక్తి లేకపోవడం వంటి కుంగుబాటు లక్షణాలు ఉత్పన్నం కావచ్చని అమెరికాలో నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంది.

Published : 07 Jul 2024 04:33 IST

దిల్లీ: వాతావరణంలో సాధారణంగా కనిపించే విషతుల్య పదార్థాల (టాక్సిన్లు)తో నిరాశావాదం, రోజువారీ కార్యక్రమాలపై పెద్దగా ఆసక్తి లేకపోవడం వంటి కుంగుబాటు లక్షణాలు ఉత్పన్నం కావచ్చని అమెరికాలో నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంది. ఈ పదార్థాలతో తలెత్తే ఇన్‌ఫ్లమేషన్‌ ఇందుకు ప్రధాన కారణమై ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ పరిశోధనలో చైనాలోని పెకింగ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కూడా పాల్గొన్నారు. అమెరికన్ల ఆరోగ్య, పోషకాహార స్థాయిని విశ్లేషించిన ‘నేషనల్‌ హెల్త్‌ అండ్‌ న్యూట్రిషన్‌ ఎగ్జామినేషన్‌ సర్వే’ (ఎన్‌హెచ్‌ఏఎన్‌ఈఎస్‌) వివరాల నుంచి 3,400 మందికి సంబంధించిన డేటాను తీసుకున్నారు. వారి రక్త, మూత్ర నమూనాల్లో ఉన్న వివిధ టాక్సిన్ల స్థాయిని విశ్లేషించారు. ప్రశ్నావళి ద్వారా వారి నుంచి కుంగుబాటు వివరాలను తీసుకున్నారు. అలాగే ఆ సమస్య తీవ్రతనూ విశ్లేషించారు. భారలోహాలు, నికోటిన్‌తోపాటు పెయింట్లలో ఉండే వోలటైల్‌ ఆర్గానిక్‌ పదార్థా (వీవోసీ)ల వల్ల కుంగుబాటు లక్షణాలు పెరుగుతున్నట్లు గుర్తించారు. ఎంహెచ్‌బీఎంఏ2 అనే వీవోసీ గణనీయ స్థాయిలో ఉన్నవారు ఇలాంటి మానసిక సమస్యల బారినపడే అవకాశం 74 శాతం అధికమని కూడా తేల్చారు. పర్యావరణంలోని విషతుల్య పదార్థాల ప్రభావం పురుషులపైనే ఎక్కువని గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని