ఊబకాయ నిర్ధారణకు బీఎంఐ ఒక్కటే సరిపోదు

ఊబకాయాన్ని నిర్వచించడానికి కేవలం శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి సూచీ (బీఎంఐ)పైనే ఆధారపడటం సరికాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక వ్యక్తి శరీరమంతటా కొవ్వు ఎంతమేర వ్యాపించిందన్నది కూడా కీలకమేనని పేర్కొన్నారు.

Published : 07 Jul 2024 04:33 IST

దిల్లీ: ఊబకాయాన్ని నిర్వచించడానికి కేవలం శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి సూచీ (బీఎంఐ)పైనే ఆధారపడటం సరికాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక వ్యక్తి శరీరమంతటా కొవ్వు ఎంతమేర వ్యాపించిందన్నది కూడా కీలకమేనని పేర్కొన్నారు. ఈ మేరకు ఊబకాయాన్ని నిర్ధారించడానికి, నియంత్రించడానికి కొత్త కార్యాచరణను యూరోపియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ ఒబేసిటీ (ఈఏఎస్‌వో) పరిశోధకులు సూచించారు. ఇందులో భాగంగా.. ఉదరభాగంలో పేరుకుపోయిన కొవ్వుపై దృష్టి సారించాలన్నారు. అలాగే నడుము, ఎత్తుల నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఈ సూచీ ఎక్కువగా ఉంటే గుండె, జీవక్రియలకు సంబంధించిన రుగ్మతలు తలెత్తే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక వ్యక్తికి నడుము-ఎత్తు నిష్పత్తి 0.5 కన్నా ఎక్కువగా ఉండి, బీఎంఐ 25-30 ఉంటే.. అతడికి ఊబకాయం ఉన్నట్లుగా పరిగణించాలని సూచించారు. నడుము చుట్టు కొలత కన్నా నడుము, ఎత్తుల నిష్పత్తిని ప్రామాణికంగా తీసుకోవడానికి కారణం.. అది గుండె, జీవక్రియకు సంబంధించిన రుగ్మతల ముప్పును సూచించే సాధనంగా ఉపయోగపడటమే. ఉదర భాగంలో పేరుకుపోయిన కొవ్వు పరిమాణం.. ఆరోగ్య క్షీణత గురించి తెలుసుకోవడానికి చాలా నమ్మకమైన సూచిక అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విషయంలో అది బీఎంఐ కన్నా మెరుగ్గా భవిష్యత్‌కు దర్పణం పడుతుందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని