సంక్షిప్త వార్తలు

పాకిస్థాన్‌ ప్రభుత్వం తమ దేశం నుంచి అఫ్గాన్‌ పౌరులను బలవంతంగా వెనక్కి పంపించేస్తోంది.

Published : 08 Jul 2024 04:07 IST

అఫ్గాన్‌ పౌరులను పాక్‌ వెళ్లగొట్టొద్దు

పాకిస్థాన్‌ ప్రభుత్వం తమ దేశం నుంచి అఫ్గాన్‌ పౌరులను బలవంతంగా వెనక్కి పంపించేస్తోంది. దానివల్ల ప్రధానంగా మహిళలు, బాలికల పరిస్థితి దారుణంగా తయారయ్యే ముప్పుంది. తాలిబన్ల పాలనలో వారికి తీవ్ర వేధింపులు ఎదురవుతాయి. ఆరో తరగతికి మించి బాలికలు చదువుకునేందుకు అనుమతి ఉండదు. కాబట్టి వారి భద్రత, హక్కులను దృష్టిలో పెట్టుకొని పాక్‌ సర్కారు అఫ్గానీల విషయంలో తమ విధానాన్ని పునఃసమీక్షించుకోవాలి. తాలిబన్ల అణచివేత నుంచి అఫ్గాన్‌ మహిళలకు రక్షణ కల్పించాలి. ఆ దేశ బాలికలు పాక్‌లోనే ఉంటూ పాఠశాలలకు వెళ్లేలా చర్యలు చేపట్టాలి. 

మలాలా యూసఫ్‌జాయ్, నోబెల్‌ పురస్కార గ్రహీత


పాజిటివ్‌లాగే.. నెగెటివ్‌ కూడా ముఖ్యం!

‘నెగెటివ్‌’ అనే దాన్ని మన జీవితం  నుంచి పూర్తిగా బహిష్కరించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నెగెటివ్‌ కూడా పాజిటివ్‌లాగే చాలా కీలకం. మీ జీవితం పరిపూర్ణం కాదని ఎప్పుడైనా మీ బాధ గుర్తుచేస్తే.. ఆ బాధనే ఆలంబనగా చేసుకొని జీవితంలో ఎదగండి! 

అమృతాంజలి, సాఫ్ట్‌వేర్‌ నిపుణురాలు


పర్యావరణ మార్పులతో పిల్లలపై ప్రతికూల ప్రభావాలు

పర్యావరణంలో వచ్చే మార్పులు పిల్లలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఉష్ణోగ్రతలు పెరిగితే పాఠశాలల్లో వారి చదువులు దెబ్బతింటాయి. కరవుల వల్ల పోషకాహార లేమి తలెత్తుతుంది. వరదలతో గాయాల బారిన పడతారు. వాయు కాలుష్యం వల్ల పుట్టుకతో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలా పర్యావరణ సంక్షోభం చిన్నారులపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుంది. 

యునిసెఫ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని