రష్యాపై ఉక్రెయిన్‌ ప్రతిదాడులు

రష్యా చేస్తున్న దాడులను దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌.. డ్రోన్లు, క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో ఇటీవల చేసిన డ్రోన్ల దాడితో రష్యాలోని మందుగుండు గోదాముల్లో మంటలు చెలరేగాయి.

Published : 08 Jul 2024 04:07 IST

కీవ్‌: రష్యా చేస్తున్న దాడులను దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌.. డ్రోన్లు, క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో ఇటీవల చేసిన డ్రోన్ల దాడితో రష్యాలోని మందుగుండు గోదాముల్లో మంటలు చెలరేగాయి. ప్రధాని మోదీ రష్యా పర్యటనకు ఒక రోజు ముందు రష్యాలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ దాడుల్లో ప్రాణనష్టం ఏమీ జరగలేదని వొరోనెజ్‌ గవర్నర్‌ అలెగ్జాండర్‌ గుసేవ్‌ పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నామన్నారు. అక్కడ పేలుడు పదార్థాలు ఇంకా విస్ఫోటం చెందుతూనే ఉన్నాయని స్థానిక అధికారులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని