మోదీ పర్యటనపై పాశ్చాత్య దేశాలకు ఈర్ష్య: రష్యా

భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఎంతో ముఖ్యమైందని, పూర్తి స్థాయిలో సాగనుందని, అధ్యక్షుడు పుతిన్‌తో శిఖరాగ్ర స్థాయి చర్చలు జరగనున్నాయని రష్యా పేర్కొంది.

Published : 08 Jul 2024 04:08 IST

మాస్కో: భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఎంతో ముఖ్యమైందని, పూర్తి స్థాయిలో సాగనుందని, అధ్యక్షుడు పుతిన్‌తో శిఖరాగ్ర స్థాయి చర్చలు జరగనున్నాయని రష్యా పేర్కొంది. ఈ పర్యటన పట్ల పాశ్చాత్య దేశాలు ఈర్ష్యగా ఉన్నాయని అభిప్రాయపడింది. సోమ, మంగళవారాల్లో మోదీ రష్యాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పుతిన్‌ ఆహ్వానం మేరకు ఈ పర్యటనకు ఆయన వెళ్తున్నారు. ఉక్రెయిన్‌పై దాడి తర్వాత మోదీ రష్యాలో పర్యటించడం ఇదే మొదటిసారి. రెండు దేశాల మధ్య పలు అంశాలపై వ్యూహాత్మక చర్చలు జరగనున్నాయి. 

ఆస్ట్రియా పర్యటన.. సహకారంలో సరికొత్త శకం: మోదీ 

ప్రజాస్వామ్య విలువలు, స్వేచ్ఛ, చట్టబద్ధ పాలన పునాదులపై భారత్, ఆస్ట్రియా నిర్మించుకున్న బంధంలో సరికొత్త సహకార శకం ప్రారంభం కానుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రష్యా, ఆస్ట్రియాల్లో మోదీ పర్యటన నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలుకుతూ ఆస్ట్రియా ఛాన్సలర్‌ కార్ల్‌ నెహమ్మర్‌ శనివారం ఎక్స్‌లో పోస్టు పెట్టారు. దీనిపై ఆదివారం మోదీ స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని