అక్రమ బంగారు గనిపై విరిగిపడిన కొండ చరియలు

ఇండోనేసియాలోని సుల్వేసీ ద్వీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా అక్కడి అక్రమ బంగారు గనిపై కొండ చరియలు విరిగిపడి 12 మంది మృతి చెందారు.

Published : 09 Jul 2024 03:53 IST

ఇండోనేసియాలో 12 మంది మృతి   

జకార్తా: ఇండోనేసియాలోని సుల్వేసీ ద్వీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా అక్కడి అక్రమ బంగారు గనిపై కొండ చరియలు విరిగిపడి 12 మంది మృతి చెందారు. గోరంటాలో ప్రావిన్సులోని బోన్‌ బోలాంగో జిల్లాలో 100 మందికిపైగా గ్రామస్థులు ఆదివారం అక్రమంగా ఏర్పాటు చేసిన బంగారు గనిలో తవ్వకాలు జరుపుతున్నారు. భారీ వర్షాల కారణంగా సమీపంలోని కొండ చరియలు విరిగిపడి బురదమట్టి ఒక్కసారిగా గ్రామస్థులపై పడింది. దీంతో 12 మంది మరణించారు. ఆరుగురు గాయాలతో బయటపడ్డారు. 44 మంది ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. 48 మంది గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కుండపోత వర్షాల కారణంగా ఐదు గ్రామాల్లో 10 అడుగుల మేర బురద పేరుకుపోయింది. 300 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఆ గ్రామాలకు చెందిన 1000 మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు