అత్యంత వేడి నెలగా జూన్‌

అయిదు ఖండాల్లోని కోట్ల మంది ప్రజలు గత నెలలో తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నారని, జూన్‌ అత్యంత వేడి నెలగా నమోదైందని ఐరోపా సమాఖ్యకు చెందిన వాతావరణ సంస్థ కోపర్నికస్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ సర్వీస్‌(సీ3ఎస్‌) సోమవారం నిర్ధారించింది. 

Published : 09 Jul 2024 03:53 IST

ఐరోపా సమాఖ్యకు చెందిన సీ3ఎస్‌ నిర్ధారణ 

దిల్లీ: అయిదు ఖండాల్లోని కోట్ల మంది ప్రజలు గత నెలలో తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నారని, జూన్‌ అత్యంత వేడి నెలగా నమోదైందని ఐరోపా సమాఖ్యకు చెందిన వాతావరణ సంస్థ కోపర్నికస్‌ క్లైమేట్‌ ఛేంజ్‌ సర్వీస్‌(సీ3ఎస్‌) సోమవారం నిర్ధారించింది.  ఆ నెలలో ఉపరితల సగటు ఉష్ణోగ్రత  16.66 డిగ్రీలుగా ఉందని, అది 1991-2020 వ్యవధిలో సగటు నెల ఉష్ణోగ్రతతో పోలిస్తే 0.67 డిగ్రీలు ఎక్కువని పేర్కొంది. 2023 జూన్‌తో పోలిస్తే 0.14 డిగ్రీలు అధికమని వెల్లడించింది. అలాగే వరుసగా 12 నెలలపాటు పారిశ్రామికీకరణ ముందు(1850-1900) ప్రపంచవ్యాప్త సగటు ఉష్ణోగ్రతల కంటే 1.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత కూడా ఇదే నెలలో అధికంగా నమోదైందని చెప్పింది. 2023-2024లోని ఎల్‌నినో ప్రభావం, మానవ చర్యల ఫలితమే దీనికి కారణంగా పేర్కొంది. ఫలితంగా జూన్‌లో వివిధ దేశాలు అధిక ఉష్ణోగ్రతలు, ఆకస్మిక వరదలు, తుపానులు    ఎదుర్కొన్నాయని తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని