రూ.15 కోట్లు పలికిన నెపోలియన్‌ తుపాకులు

ఐరోపా చరిత్రపై తిరుగులేని ముద్ర వేసిన ఫ్రెంచ్‌ చక్రవర్తి నెపోలియన్‌ బోనాపార్టేకు చెందిన అరుదైన వస్తువులు వేలం వేశారు.

Published : 09 Jul 2024 03:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐరోపా చరిత్రపై తిరుగులేని ముద్ర వేసిన ఫ్రెంచ్‌ చక్రవర్తి నెపోలియన్‌ బోనాపార్టేకు చెందిన అరుదైన వస్తువులు వేలం వేశారు. వీటిల్లో రెండు పిస్తోళ్లు ఉన్నాయి. వీటిని వేలం వేయగా 1.69 మిలియన్‌ యూరోలకు అవి అమ్ముడుపోయాయి. భారత కరెన్సీ ప్రకారం రూ.15 కోట్లు పైమాటే. బ్లూఫౌంటేన్‌ ప్యాలెస్‌ పక్కనే ఉన్న ఆక్షన్‌ హౌస్‌లో ఆదివారం వీటి వేలం జరిగింది. అదే ప్యాలెస్‌లో 1814 ఏప్రిల్‌ 12వ తేదీన నెపోలియన్‌ ఓ తుపాకీతో ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. నెపోలియన్‌ వాడిన తుపాకులను లూయిస్‌ మెరైన్‌ గోస్సెట్‌ అనే కంపెనీ తయారు చేసింది. 

 ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఈ తుపాకులను జాతీయసంపదగా ఇటీవలే ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం ఈ వస్తువులను ఎగుమతిపై నిషేధం అమల్లోకి రానుంది. అదే సమయంలో ఇవి ఎవరివద్ద ఉంటే వారి నుంచి 30 నెలల్లోపు ఫ్రాన్స్‌ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఈ తుపాకుల తయారీలో బంగారం, వెండి వినియోగించారు. అవి నెపోలియన్‌ సైనికాధికారి కుటుంబానికి వారసత్వంగా లభించాయి. ఈ వేలంలో తుపాకులు, వాటి బాక్స్, పౌడర్‌ హార్న్‌ ఇతర యాక్సెసరీస్‌లు కూడా వేలంలో ఉంచారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని