మీ శ్రమకు దక్కిన ఫలితం

ప్రధాని మోదీని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ గౌరవార్థం విందు ఇచ్చిన సందర్భంగా ఆయన మూడోసారి విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు.

Published : 09 Jul 2024 03:55 IST

మోదీకి పుతిన్‌ ప్రశంస

మాస్కో: ప్రధాని మోదీని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ గౌరవార్థం విందు ఇచ్చిన సందర్భంగా ఆయన మూడోసారి విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ‘మూడోసారి గెలిచినందుకు శుభాకాంక్షలు. ఇది యాదృచ్చికంగా సాధించిన విజయం కాదు. ఎన్నో ఏళ్లుగా మీరు చేసిన కృషికి, మీ శ్రమకు దక్కిన ఫలితం. మీకు మీ సొంత ఆలోచనలున్నాయి. మీరు ఎంతో శక్తిమంతమైన వ్యక్తి. భారత్, భారతీయుల ప్రయోజనాల కోసం లక్ష్యాలను సాధించగల దిట్ట’ అని పుతిన్‌ కొనియాడారు. భారత్‌ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రశంసించారు. ఇద్దరు నేతలు పుతిన్‌ నివాసంలో టీ తాగుతూ మాట్లాడుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని