సునాక్‌ షాడో మంత్రివర్గం

బ్రిటన్‌ పార్లమెంటులో తాత్కాలిక ప్రతిపక్ష నేత, మాజీ ప్రధాని రిషి సునాక్‌ షాడో మంత్రివర్గాన్ని ప్రకటించారు.

Published : 10 Jul 2024 04:07 IST

లండన్‌: బ్రిటన్‌ పార్లమెంటులో తాత్కాలిక ప్రతిపక్ష నేత, మాజీ ప్రధాని రిషి సునాక్‌ షాడో మంత్రివర్గాన్ని ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం వరకు సునాక్‌ నేతృత్వంలో అధికారంలో ఉన్న కన్సర్వేటివ్‌ పార్టీని ఓడించి అఖండ మెజారిటీతో లేబర్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. మంగళవారం కొత్త పార్లమెంటు సభ్యులు ప్రమాణం చేశారు. జులై 17న బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3 ప్రసంగంతో పార్లమెంటు సమావేశమవుతుంది. అప్పుడు కీర్‌ స్టార్మర్‌ ప్రధానిగా ఏర్పడే లేబర్‌ ప్రభుత్వంతో పాటే ప్రతిపక్ష షాడో మంత్రివర్గం కూడా రంగంలోకి దిగుతుంది. కొత్త ప్రభుత్వంలోని మంత్రులు నిర్వహించే శాఖలకు గతంలో సారథ్యం వహించిన మాజీ మంత్రులతో షాడో మంత్రివర్గం ఏర్పడుతుంది. మంత్రులకు దీటుగా విధానాలను ప్రతిపాదిస్తుంది. ప్రభుత్వ విధానాల్లోని లోపాలనూ ఎత్తిచూపుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని