ప్రభుత్వ ఏర్పాటుపై ఫ్రాన్స్‌లో మంతనాలు

ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం లభించని పరిస్థితుల్లో ఫ్రాన్స్‌లో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు మొదలయ్యాయి.

Published : 10 Jul 2024 04:08 IST

రంగంలోకి ఫ్రాన్స్‌వో హోలన్‌ 

పారిస్‌: ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం లభించని పరిస్థితుల్లో ఫ్రాన్స్‌లో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు మొదలయ్యాయి. ఎక్కువ సీట్లు పొందినా ఆధిక్యానికి దూరమైన వామపక్ష కూటమి తరఫున అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్, నూతన శాసనకర్తలు మంగళవారం పెద్దఎత్తున ప్రయత్నాలు ప్రారంభించారు. ‘న్యూ పాపులర్‌ ఫ్రంట్‌’ వామపక్ష సంకీర్ణ సర్కారు ఏర్పడుతుందని వారు విశ్వాసంతో ఉన్నారు. అందుకే తమలో ఎవరు ప్రధాని పదవిని అధిష్ఠించాలనే విషయంలో మూడు భాగస్వామ్య పక్షాల నేతలు మంతనాలు ప్రారంభించారు. ఇటీవలి కాలంలో హోలన్‌ రాజకీయంగా మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వామపక్ష కూటమి, మెక్రాన్‌కు చెందిన మధ్యేవాదుల కూటమి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని