చైనా కట్టడికి నాటో వ్యూహం

అగ్రరాజ్యం అమెరికా సహా పాశ్చాత్య దేశాలకు పలు రంగాల్లో సవాల్‌ విసురుతున్న చైనాను కట్టడి చేసేలా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని కీలకమైన దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకునేందుకు నాటో కూటమి యత్నిస్తోంది.

Published : 10 Jul 2024 04:08 IST

వాషింగ్టన్‌లో మూడు రోజులపాటు కూటమి సదస్సు 

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా సహా పాశ్చాత్య దేశాలకు పలు రంగాల్లో సవాల్‌ విసురుతున్న చైనాను కట్టడి చేసేలా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలోని కీలకమైన దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పుకునేందుకు నాటో కూటమి యత్నిస్తోంది. మంగళవారం నుంచి గురువారం వరకు వాషింగ్టన్‌లో జరుగుతున్న నాటో సదస్సుకు ఇండో-పసిఫిక్‌ ప్రాంతానికి చెందిన న్యూజిలాండ్, జపాన్, దక్షిణ కొరియా దేశాధినేతలు కూడా హాజరుకానున్నారు. రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు నాటో కూటమి దేశాల నుంచి ఆయుధాలతో పాటు ఆర్థిక చేయూతను మరింత పెంచేలా సదస్సులో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని