బైడెన్‌ పార్కిన్సన్స్‌కు చికిత్స తీసుకొంటున్నారా?

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరోగ్యంపై ఇప్పటికే పెద్దఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న వేళ.. శ్వేతసౌధానికి పార్కిన్సన్స్‌ వ్యాధి నిపుణుడు పలుమార్లు రావడం మరో చర్చకు దారి తీసింది.

Published : 10 Jul 2024 04:09 IST

మీడియా ప్రశ్నలకు మండిపడిన శ్వేతసౌధం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరోగ్యంపై ఇప్పటికే పెద్దఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న వేళ.. శ్వేతసౌధానికి పార్కిన్సన్స్‌ వ్యాధి నిపుణుడు పలుమార్లు రావడం మరో చర్చకు దారి తీసింది. అమెరికాలో పార్కిన్సన్స్‌ స్పెషలిస్ట్‌గా పేరున్న డాక్టర్‌ కెవిన్‌ కెనార్డ్‌ గత ఎనిమిది నెలల్లో ఎనిమిదిసార్లు శ్వేతసౌధానికి వచ్చినట్లు సందర్శకుల లాగ్‌బుక్‌ ద్వారా తెలిసింది. దీంతో అధ్యక్షుడు పార్కిన్సన్స్‌ చికిత్స తీసుకుంటున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై శ్వేతసౌధం మండిపడింది. బైడెన్‌కు అలాంటి ఆరోగ్య సమస్యలు లేవని.. ఏ చికిత్సా తీసుకోవడం లేదని అధికార ప్రతినిధి కరీన్‌ జీన్‌ పియర్‌ సోమవారం వెల్లడించారు. సాధారణ పరీక్షల్లో భాగంగానే ఓ న్యూరాలజిస్ట్‌ మూడుసార్లు అధ్యక్షుణ్ని కలిసినట్లు చెప్పారు. వైద్యుడి పేరును మాత్రం ధ్రువీకరించలేదు. అది ఇతరుల గోప్యతకు భంగం కలిగిస్తుందన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు పియర్‌తో వాగ్వాదానికి దిగారు. ఎంత ఒత్తిడి తెచ్చినా, తాను ఇవ్వగలిగిన సమాచారం ఇంతేనని ఆమె స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు