తుపానుతో హ్యూస్టన్‌ అతలాకుతలం

అమెరికాలో నాలుగో పెద్ద నగరమైన హ్యూస్టన్‌పై బెరైల్‌ తుపాను విరుచుకుపడి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

Published : 11 Jul 2024 04:10 IST

 హ్యూస్టన్‌: అమెరికాలో నాలుగో పెద్ద నగరమైన హ్యూస్టన్‌పై బెరైల్‌ తుపాను విరుచుకుపడి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తుపాను వల్ల 20 లక్షల ఇళ్లు, వ్యాపారాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఇళ్ల పైకప్పుల నుంచి నీరు కారిపోతోంది. పగటి ఉష్ణోగ్రత 90 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ను మించగా ఎయిర్‌ కండిషనర్లు పనిచేయక జనం ఇబ్బందులు పడ్డారు. ఇంటర్నెట్, ల్యాండ్‌ లైన్లు, మొబైల్‌ ఫోన్లు ఏవీ పనిచేయలేదు. కార్లు నడపడానికి పెట్రోల్‌ అందుబాటులో లేకుండా పోయింది. నగర వీధులు తుపాను నీటితో జలమయమయ్యాయి. రోడ్లపై చెట్లు కూలిపడ్డాయి. రాష్ట్రంలో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు అత్యవసర ప్రాతిపదికపై సహాయం అందించాలని టెక్సస్‌ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్‌ డాన్‌ ప్యాట్రిక్‌ అధ్యక్షుడు జో బైడెన్‌కు ఫోన్‌లో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తుపానుతో దెబ్బతిన్న సగభాగానికి బైడెన్‌ అత్యవసర సహాయం ప్రకటించారు. తుపాను సృష్టించిన శిథిలాలను తొలగించడానికయ్యే ఖర్చులో 75 శాతాన్ని ఫెడరల్‌ ప్రభుత్వమే భరించనుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని