దక్షిణాఫ్రికాలో 12 మంది విద్యార్థుల సజీవదహనం

పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తాపడి, మంటలు అంటుకోవడంతో దక్షిణాఫ్రికాలో 12 మంది పిల్లలు సజీవ దహనమయ్యారు.

Published : 11 Jul 2024 04:11 IST

పాఠశాల బస్సుకు ఘోర ప్రమాదం 

జొహన్నెస్‌బర్గ్‌: పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తాపడి, మంటలు అంటుకోవడంతో దక్షిణాఫ్రికాలో 12 మంది పిల్లలు సజీవ దహనమయ్యారు. గౌటెంగ్‌ ప్రావిన్సులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.  సెలవుల అనంతరం బడులను తెరచిన ఒకరోజు వ్యవధిలోనే ఈ ఘోరం జరగడంతో విషాదం నెలకొంది. గాయపడిన ఏడుగురు చిన్నారుల్ని ఆసుపత్రిలో చేర్చారు. బస్సును ఓ చిన్న ట్రక్కు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని