ఉక్రెయిన్‌ యుద్ధం త్వరలోనే ముగుస్తుంది: బైడెన్‌

రష్యా భీకర దాడులతో అల్లాడిపోతున్న ఉక్రెయిన్‌కు తాము ఐదు వ్యూహాత్మక గగనతల రక్షణ వ్యవస్థలను సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు.

Published : 11 Jul 2024 04:12 IST

వాషింగ్టన్‌: రష్యా భీకర దాడులతో అల్లాడిపోతున్న ఉక్రెయిన్‌కు తాము ఐదు వ్యూహాత్మక గగనతల రక్షణ వ్యవస్థలను సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ఈ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని జోస్యం చెప్పారు. ఉక్రెయిన్‌ కచ్చితంగా సురక్షితంగా ఉంటుందని, రష్యాకు మాత్రం రక్షణ లేదని వ్యాఖ్యానించారు. వాషింగ్టన్‌లో నాటో దేశాధినేతల సదస్సు ప్రారంభోపన్యాసంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఈ సైనిక కూటమి ఎన్నడూ లేనంత శక్తిమంతంగా ఉందని, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఇప్పుడు పెనుమార్పు దశను ఎదుర్కొంటోందని తెలిపారు. 

 నాటో సభ్యదేశమైన నార్వే ఆరు ఎఫ్‌-16 యుద్ధ విమానాలను ఉక్రెయిన్‌కు విరాళంగా అందించనుంది. చాలాకాలం నుంచి ఈ అధునాతన పోరాట విమానాలను ఉక్రెయిన్‌ కోరుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని