సంక్షిప్త వార్తలు

బైడెన్‌ మేధో సామర్థ్య క్షీణత అంశాన్ని 2020 నుంచి అమెరికాలోని ప్రధాన మీడియా సంస్థలు విస్మరించడమో, పెద్దగా పట్టించుకోకపోవడమో చేశాయి.

Updated : 11 Jul 2024 04:26 IST

నాడు విస్మరించాయ్‌.. నేడు ఒత్తిడి చేస్తున్నాయ్‌!

బైడెన్‌ మేధో సామర్థ్య క్షీణత అంశాన్ని 2020 నుంచి అమెరికాలోని ప్రధాన మీడియా సంస్థలు విస్మరించడమో, పెద్దగా పట్టించుకోకపోవడమో చేశాయి. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. ఆ దేశంలోని ప్రధాన వార్తాసంస్థలన్నీ బైడెన్‌ విషయంలో చాలా కటువుగా వ్యవహరిస్తున్నాయి. అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకొనేలా ఆయన్ను ఒత్తిడి చేసేందుకు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి! 

 బ్రహ్మ చెలానీ, విదేశీ వ్యవహారాల నిపుణులు 


ప్రతి అంశాన్నీ అవకాశంగా చూడండి

ప్రతి విషయాన్నీ ఓ అవకాశంగా చూడటం నేర్చుకుంటే మీ జీవితం చాలా ఉల్లాసంగా సాగుతుంది. మీరు ప్రయాణించాల్సిన విమానం ఆలస్యమైతే.. ఓపిక వహించండి. సర్వీస్‌ వర్కర్‌ దురుసుగా ప్రవర్తిస్తే.. సానుభూతి ప్రదర్శించండి. మీరు పనిచేసే చోట అగ్నిప్రమాదం జరిగితే.. మంటలు ఆర్పేందుకు మెరుగైన విధానాన్ని వెంటనే ఆలోచించి రంగంలో దిగండి. మనసును ఎంత తేలికగా ఉంచుకుంటే.. జీవితం అంత మెరుగుపడుతుంది. 

 డికీ బష్, నైపుణ్యాల శిక్షకుడు 


ఉత్సుకతతోనే ఎక్కువ ప్రేరణ 

క్రమశిక్షణ కంటే ఉత్సుకతే పనిలో  ఎక్కువ ప్రేరణనిస్తుంది. ఏ రంగంలోనైనాసరే.. గొప్ప పని విలువలు, అద్భుత క్రమశిక్షణ కలిగి ఉన్నారని మీకు అనిపించిన వ్యక్తులను బాగా పరిశీలించండి. వారికి ఆ రంగంలో కచ్చితంగా ఉత్సుకత, ఆసక్తి అమితంగా ఉంటాయి. 

 జేమ్స్‌ క్లియర్, రచయిత


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని