ఉక్రెయిన్‌పై రష్యాతో విభేదాల్లేవ్‌: భారత్‌

ఉక్రెయిన్‌ విషయంలో రష్యాతో విభేదాలు తలెత్తాయని వచ్చిన వార్తలన్నీ కట్టుకథలేనని భారత్‌ స్పష్టం చేసింది.

Published : 11 Jul 2024 04:17 IST

వియన్నా: ఉక్రెయిన్‌ విషయంలో రష్యాతో విభేదాలు తలెత్తాయని వచ్చిన వార్తలన్నీ కట్టుకథలేనని భారత్‌ స్పష్టం చేసింది. ఈ కారణంగా ప్రధాని మోదీ పర్యటనలో ఒక కార్యక్రమం రద్దయిందని వచ్చిన సమాచారం పూర్తిగా తప్పని తేల్చి చెప్పింది. ‘నాకు తెలిసిన వివరాల మేరకు మాస్కోలో ప్రధాని మోదీ ఏ కార్యక్రమమూ రద్దు కాలేదు. ఈ వార్తలను చూసి ఆశ్చర్యపోయా. ఇవి తప్పుదోవ పట్టించేవే. పూర్తిగా అవాస్తవం’ అని విదేశాంగశాఖ కార్యదర్శి వినయ్‌ క్వాట్రా బుధవారం వియన్నాలో స్పష్టం చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని