Cancer:ప్రారంభంలోనే క్యాన్సర్‌ను పట్టుకోవచ్చు..తెరపైకి కొత్త పరీక్ష

వ్యాధి లక్షణాలు బయటపడటానికి ముందే క్యాన్సర్‌ను గుర్తించేందుకు అమెరికా శాస్త్రవేత్తలు కొత్త రకం రక్తపరీక్షను అభివృద్ధి చేశారు. ఇది వ్యాధి నిర్ధారణను సులువు చేస్తుంది.

Updated : 08 Jan 2022 09:15 IST

వాషింగ్టన్‌: వ్యాధి లక్షణాలు బయటపడటానికి ముందే క్యాన్సర్‌ను గుర్తించేందుకు అమెరికా శాస్త్రవేత్తలు కొత్త రకం రక్తపరీక్షను అభివృద్ధి చేశారు. ఇది వ్యాధి నిర్ధారణను సులువు చేస్తుంది. అనేక రకాల క్యాన్సర్లను గుర్తిస్తుంది. శరీరంలో భాగాలకు వ్యాప్తి చెందిందా అన్నది కూడా తెలియజేస్తుంది. ఈ విధానాన్ని 300 మంది రోగులపై పరీక్షించారు. వీరిలో క్యాన్సర్‌కు నిర్దిష్ట లక్షణాలేమీ లేవు. అలసట, బరువు తగ్గడం వంటివి మాత్రమే కనిపించాయి. ప్రతి 20 మంది క్యాన్సర్‌ రోగుల్లో 19 మందిని ఇది కచ్చితత్వంతో గుర్తించింది. ఇతర అవయవాలకు ఈ వ్యాధి పాకడాన్ని 94% కచ్చితత్వంతో పసిగట్టింది. సాధారణ రక్తపరీక్షతో క్యాన్సర్‌ విస్తృతిని గుర్తించే సామర్థ్యమున్న మొట్టమొదటి పరిజ్ఞానం ఇదేనని శాస్త్రవేత్తలు తెలిపారు. కొత్త ప్రక్రియలో ఎన్‌ఎంఆర్‌ మెటాబోలోమిక్స్‌ అనే విధానాన్ని ఉపయోగించారు. ఇందులో.. రక్తంలోని సహజసిద్ధ రసాయనాల (మెటబోలైట్స్‌) తీరుతెన్నులను అధికస్థాయి అయస్కాంత క్షేత్రాలు, రేడియో తరంగాల సాయంతో పరిశీలిస్తారు. ఆరోగ్యవంతులు, క్యాన్సర్‌ ఒక భాగానికే పరిమితమైనవారు, ఈ వ్యాధి విస్తరించినవారికి రక్తంలోని మెటబోలైట్ల తీరు వేర్వేరుగా ఉంటుంది. ప్రత్యేకంగా రూపొందించిన అల్గోరిథమ్‌లు వాటిని విశ్లేషించి, గుర్తిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు