Corona Virus: పది రోజులు గడిచినా కొందరిలో ‘దశ’ మారదు

కొవిడ్‌-19 సోకి, 10 రోజుల క్వారంటైన్‌ కాలం పూర్తి చేసుకున్న తర్వాత కూడా కొందరి నుంచి ఆ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు తేల్చారు. ఇలాంటివారిలో క్రియాశీలక వైరస్‌ జాడను పట్టుకొనేందుకు సరికొత్త పరీక్షను

Updated : 19 Jan 2022 08:02 IST

క్రియాశీలకంగానే కరోనా వైరస్‌

లండన్‌: కొవిడ్‌-19 సోకి, 10 రోజుల క్వారంటైన్‌ కాలం పూర్తి చేసుకున్న తర్వాత కూడా కొందరి నుంచి ఆ వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు తేల్చారు. ఇలాంటివారిలో క్రియాశీలక వైరస్‌ జాడను పట్టుకొనేందుకు సరికొత్త పరీక్షను ఉపయోగించారు.

ఎక్సెటర్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వీరు.. ప్రామాణిక పీసీఆర్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన 176 మంది నుంచి నమూనాలను సేకరించారు. వాటిపై కొత్త పరీక్షను ప్రయోగించారు. 13% మందిలో 10 రోజుల తర్వాత కూడా గణనీయ స్థాయిలో క్రియాశీలక వైరస్‌ ఆనవాళ్లు కనిపించాయి. కొందరిలో 68 రోజుల వరకూ ఇదే పరిస్థితి కొనసాగినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ‘‘ఇది ఒకింత చిన్న అధ్యయనమే. అయితే 10 రోజుల తర్వాత కూడా కొందరిలో క్రియాశీలక వైరస్‌ ఉండొచ్చని, దీనివల్ల వ్యాధి వ్యాప్తి చెందొచ్చని ఇది స్పష్టం చేస్తోంది. నిర్దిష్టంగా ఎవరిలో ఈ పరిస్థితి ఉత్పన్నం కావొచ్చన్నది ఊహించడం కష్టం’’ అని పరిశోధనను పర్యవేక్షించిన ప్రొఫెసర్‌ లోర్నా హారిస్‌ పేర్కొన్నారు.

వైరస్‌లోని భాగాల ఉనికిని పట్టుకోవడం ద్వారా సంప్రదాయ పీసీఆర్‌ పరీక్షలు పనిచేస్తాయి. ఒక వ్యక్తికి ఇటీవల వైరస్‌ సోకిందా అన్నది ఇవి చెప్పగలవు. అయితే ఆ వైరస్‌ ఇంకా క్రియాశీలకంగా ఉందా అన్నది ఇవి తేల్చలేవు. తాజాగా బ్రిటన్‌ శాస్త్రవేత్తలు ఉపయోగించిన పరీక్ష మాత్రం ఒక వ్యక్తిలో వైరస్‌ క్రియాశీలకంగా ఉండి, ఇతరులకు వ్యాప్తి చెందేలా ఉంటేనే ‘పాజిటివ్‌’ ఫలితాన్ని ఇస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని