
Corona Virus: మనుషుల నుంచి సింహాలకు కరోనా
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని ఓ ప్రైవేటు జంతు ప్రదర్శనశాలలో మనుషుల నుంచి మూడు సింహాలకు కరోనా సోకినట్లు గుర్తించారు. ఆ దేశంలో 2021 చివర్లో డెల్టా వేరియంట్ వల్ల కొవిడ్ మూడో దశ విజృంభిస్తున్న సమయంలో ఈ ఉదంతం జరిగింది. గౌటెంగ్ రాష్ట్రంలోని ప్రైవేటు జూలో కొవిడ్ లక్షణాలు బయటపడని వ్యక్తుల ద్వారా సింహాలకు వైరస్ సోకింది. కొవిడ్ బారిన పడిన సింహాలు పొడి దగ్గు, ఆయాసం, ముక్కు కారడం వంటి లక్షణాలతో 15 రోజులపాటు బాధపడ్డాయని ‘వైరసెస్’ అనే శాస్త్రీయ పత్రికలో ప్రెటోరియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. సింహాలు కొవిడ్ బారిన పడిన తరవాత ఏడు వారాల వరకు ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్‌గానే నిర్ధారణ అయ్యింది. సింహాలకు 5 నుంచి 15 రోజుల వరకు పొడి దగ్గు పట్టుకొంది. రెండు సింహాలకు ఊపిరి అందక ఆయాసపడ్డాయి. అయితే.. 15 నుంచి 25 రోజుల్లో అన్ని సింహాలూ కోలుకున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.