జీవన్మృతుడికి పంది మూత్రపిండాలు

మానవుల ప్రాణాలను కాపాడేందుకు జంతువుల అవయవాలను ఉపయోగించే దిశగా చేస్తున్న ప్రయోగాల్లో పరిశోధకులు తాజాగా మరో కీలక ముందడుగు వేశారు. అమెరికాలోని అలబామాలో- జన్యుమార్పిడి చేసిన

Published : 21 Jan 2022 05:10 IST

అమర్చి పరీక్షించిన అమెరికా పరిశోధకులు

న్యూయార్క్‌: మానవుల ప్రాణాలను కాపాడేందుకు జంతువుల అవయవాలను ఉపయోగించే దిశగా చేస్తున్న ప్రయోగాల్లో పరిశోధకులు తాజాగా మరో కీలక ముందడుగు వేశారు. అమెరికాలోని అలబామాలో- జన్యుమార్పిడి చేసిన ఓ పంది నుంచి సేకరించిన మూత్రపిండాలను.. బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తికి అమర్చారు. అనంతరం మూడు రోజుల పాటు వాటి పనితీరును పరిశీలించారు. జీవన్మృతుడి శరీరం ఆ మూత్రపిండాలను తిరస్కరించిన సంకేతాలేవీ కనిపించలేదని అలబామా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ జేమీ లాకీ గురువారం తెలిపారు. అవయవ మార్పిడి తర్వాత ఆ వ్యక్తిని ప్రాణాధార వ్యవస్థపై ఉంచిన మూడు రోజుల పాటూ అవి సక్రమంగా పనిచేసినట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని