అధ్యాపకురాలిని తొలగించిన యూనివర్సిటీ..

గట్టిగా మాట్లాడుతోందనే నెపంతో, లింగ వివక్షత ప్రదర్శిస్తూ.. ఓ మహిళా అధ్యాపకురాలిని తొలగించిన యూనివర్సిటీకి ఇంగ్లండ్‌లో చుక్కెదురైంది. బాధితురాలికి రూ.కోటి పరిహారంగా చెల్లించాలని అక్కడి కోర్టు తీర్పునిచ్చింది.

Published : 21 Jan 2022 05:55 IST

రూ.కోటి చెల్లించమన్న కోర్టు

గట్టిగా మాట్లాడుతోందనే నెపంతో, లింగ వివక్షత ప్రదర్శిస్తూ.. ఓ మహిళా అధ్యాపకురాలిని తొలగించిన యూనివర్సిటీకి ఇంగ్లండ్‌లో చుక్కెదురైంది. బాధితురాలికి రూ.కోటి పరిహారంగా చెల్లించాలని అక్కడి కోర్టు తీర్పునిచ్చింది. ఇంగ్లాండ్‌లోని ఎక్సెటెర్‌ యూనివర్సిటీ ఫిజిక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో డా.అనెట్‌ ప్లాట్‌ గత 29 ఏళ్లుగా అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. అయితే ఉన్నతాధికారులు ఆమెను ఉన్నట్లుండి ఉద్యోగంలో నుంచి తొలగించారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించారు. ‘‘సాధారణంగానే నా గొంతు గట్టిగా వినిపిస్తుంది. మహిళను, గట్టిగా మాట్లాడుతున్నాననే కారణంతోనే నన్ను ఉద్యోగంలో నుంచి తొలగించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నప్పటికీ నాపై లింగ వివక్ష చూపుతూ.. వారు ఈ విధంగా చేశారు’’ అంటూ ఆమె కోర్టుకు తెలిపారు. యూనివర్సిటీ ఫిజిక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరిన మొదటి మహిళా విద్యావేత్తగా కూడా తాను గుర్తింపు పొందినట్లు అనెట్‌ వెల్లడించారు. ఆమె ఆరోపణలపై యూనివర్సిటీ స్పందించింది. ఇద్దరు పీహెచ్‌డీ విద్యార్థులతో ఆమె వ్యవహరించిన తీరు కారణంగానే తొలగించినట్లు కోర్టుకు వివరణ ఇచ్చింది. ఆమె నేపథ్యాన్ని, లింగాన్ని పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొంది. ఇరువురి వాదనలు విన్న ఎంప్లాయ్‌మెంట్‌ ట్రిబ్యునల్‌.. అనెట్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఉద్యోగంలో నుంచి ఆమెను అన్యాయంగా తొలగించారని వ్యాఖ్యానించింది. నష్టపరిహారంగా లక్ష పౌండ్లు (దాదాపు రూ.కోటి) చెల్లించాలని యూనివర్సిటీని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని