Updated : 23 Jan 2022 07:17 IST

విమానం అత్యవసర దించివేత.. డ్యూటీ ముగిసిందన్న పైలట్‌

పాకిస్థాన్‌కు చెందిన ఓ విమానాన్ని అత్యవసరంగా దించిన పైలట్‌ ఆ తర్వాత.. తన డ్యూటీ టైం ముగిసిందంటూ వెంటనే మళ్లీ విధుల నిర్వహణకు ససేమిరా అన్నాడు. దీంతో విమానంలోనే గంటలపాటు ఉన్న ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (పీఐఏ)కు చెందిన పీకే-9754 విమానం గత ఆదివారం రియాద్‌ నుంచి ఇస్లామాబాద్‌కు బయలుదేరింది. వాతావరణం అనుకూలించలేదని పాక్‌ పైలట్‌ విమానాన్ని సౌదీ అరేబియాలోని దమామ్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ చేశాడు. ఆ తర్వాత.. తన షిఫ్టు ముగిసిందంటూ చావుకబురు చల్లగా చెప్పాడు. అప్పటికే విసిగిపోయి ఉన్న ప్రయాణికులు.. ఆందోళన చేపట్టారు. పరిస్థితులు చేయి దాటకుండా అధికారులు వారికి  ఓ హోటలులో బస ఏర్పాటు చేశారు. కొద్ది గంటల తర్వాత విమానం ఇస్లామాబాద్‌కు బయలుదేరింది.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని