Omicron: ఒమిక్రాన్‌పై స్వల్పంగా సత్తా చాటుతున్నాయి

కొవిడ్‌-19 బాధితుల చికిత్సకు ఉపయోగించే మోనోక్లోనల్‌ యాంటీబాడీలన్నింటినీ ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఏమార్చలేదని అమెరికాలోని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. కొన్నింటిని మాత్రమే అది బోల్తా కొట్టిస్తోందని

Published : 25 Jan 2022 07:23 IST

కొద్దిగా పనిచేస్తున్న మోనోక్లోనల్‌ యాంటీబాడీలు

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 బాధితుల చికిత్సకు ఉపయోగించే మోనోక్లోనల్‌ యాంటీబాడీలన్నింటినీ ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఏమార్చలేదని అమెరికాలోని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. కొన్నింటిని మాత్రమే అది బోల్తా కొట్టిస్తోందని వెల్లడైంది.

మోనోక్లోనల్‌ యాంటీబాడీలను ల్యాబ్‌లో కృత్రిమంగా తయారుచేస్తారు. శరీర రోగ నిరోధక వ్యవస్థ తరహాలో ఇవి వైరస్‌లపై పోరాడుతుంటాయి. అయితే ఇవి ఒమిక్రాన్‌ వేరియంట్‌ ముందు చతికిలపడుతున్నట్లు మునుపటి పరిశోధనలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఐదు యాంటీబాడీ మిశ్రమాలను వాషింగ్టన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు పరీక్షించారు. సెలిట్రియాన్‌, రిజెనెరాన్‌, ఎలీ లిల్లీ సహా వినియోగంలో ఉన్న పలు బయోఫార్మా కంపెనీల యాంటీబాడీలు ఒమిక్రాన్‌ను నిర్వీర్యం చేసే సామర్థ్యాన్ని కోల్పోయాయని వారు పేర్కొన్నారు. అమెరికాలోని విర్‌ బయోటెక్నాలజీ సంస్థ అభివృద్ధి చేసిన ఒక యాంటీబాడీ మాత్రం పాక్షికంగా పనిచేసినట్లు తెలిపారు. అలాగే ఎవుషెల్డ్‌ మిశ్రమంలోని కొన్ని యాంటీబాడీలకు ఈ సామర్థ్యం ఉన్నట్లు తేల్చారు.

ఒమిక్రాన్‌ వేరియంట్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌లో 30కిపైగా ఉత్పరివర్తనాలు ఉండటం వల్లే వాటిని ఈ యాంటీబాడీలు నిర్వీర్యం చేయలేకపోతున్నాయని పరిశోధకులు వివరించారు. ఈ పరిశోధనలో కొన్ని మోనోక్లోనల్‌ యాంటీబాడీలు కొంతమేర పనిచేస్తున్నట్లు వెల్లడైనా.. దీన్ని నిర్ధరించడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు