ఊబకాయంతో వచ్చే ముప్పులకు ‘దురదృష్టకర జన్యువులే’ కారణం

ఊబకాయంతో ఉన్నప్పటికీ కొంతమంది ఆరోగ్యంగానే ఉంటారు. మిగతావారు మాత్రం మధుమేహం, గుండె జబ్బు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ వైరుధ్యానికి కారణాలను బ్రిటన్‌

Updated : 26 Jan 2022 08:32 IST

బ్రిటన్‌ శాస్త్రవేత్తల పరిశోధన

లండన్‌: ఊబకాయంతో ఉన్నప్పటికీ కొంతమంది ఆరోగ్యంగానే ఉంటారు. మిగతావారు మాత్రం మధుమేహం, గుండె జబ్బు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ వైరుధ్యానికి కారణాలను బ్రిటన్‌ శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి సూచీ (బీఎంఐ) 30 శాతం కన్నా ఎక్కువగా ఉన్నవారిని ఊబకాయులుగా పరిగణిస్తుంటారు. ఒకే బీఎంఐ కలిగిన ఇద్దరు వ్యక్తుల్లో కొవ్వు పరిమాణం భిన్నంగా ఉండొచ్చు. అది శరీరం మొత్తం భిన్న ప్రాంతాల్లో ఉంటుంది. అయితే కొందరిలో ‘దురదృష్టకర జన్యువులు’ ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అవి చర్మం కింద, కాలేయం, క్లోమం వంటిచోట్ల ఎక్కువ కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. అవి కలిగి ఉన్నవారికి టైప్‌-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధనకు నాయకత్వం వహించిన హేనియా యోగోత్కర్‌ తెలిపారు. కొందరు అదృష్టవంతులకు మాత్రం భిన్న జన్యువులు ఉంటాయన్నారు. అవి చర్మం కింద అధిక కొవ్వును పేరుకుపోయేలా చేసినప్పటికీ కాలేయంలో ఎక్కువగా పోగుపడకుండా చేస్తాయన్నారు. అందువల్ల వీరికి మధుమేహం ముప్పు తక్కువగా ఉంటుందని తెలిపారు. గుండె, కాలేయం వంటి అవయవాల చుట్టూ పేరుకుపోయే కొవ్వుతో పోలిస్తే చర్మం కింద కొవ్వు చేరడం ఎక్కువ ప్రమాదకరం కాదని నిపుణులు చెబుతుంటారు. అయితే అనుకూల జన్యువులు ఉన్నా లేకున్నా ఊబకాయం వల్ల ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు స్పష్టంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని