ప్లాస్టిక్‌పై 8 రోజులు.. చర్మంపై 21 గంటలు!
ఒమిక్రాన్‌తో జాగ్రత్తగా ఉండాలంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఇది వాతావరణంలో ఎక్కువ కాలం సజీవంగా ఉంటుందని చెబుతున్నారు. ప్లాస్టిక్‌పై సుమారు 8 రోజులు, చర్మంపై 21 గంటలకు పైగా బతకగలదని
మిగతా వాటితో పోలిస్తే ఒమిక్రాన్ జీవిత కాలమెక్కువ
టోక్యో: ఒమిక్రాన్‌తో జాగ్రత్తగా ఉండాలంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. మిగతా వేరియంట్లతో పోలిస్తే ఇది వాతావరణంలో ఎక్కువ కాలం సజీవంగా ఉంటుందని చెబుతున్నారు. ప్లాస్టిక్‌పై సుమారు 8 రోజులు, చర్మంపై 21 గంటలకు పైగా బతకగలదని, అందుకే ఇది డెల్టాను మించి వేగంగా వ్యాప్తి చెందుతోందని హెచ్చరిస్తున్నారు. వీరి తాజా అధ్యయనం ప్రకారం.. ప్లాస్టిక్ ఉపరితలాలపై వరుసగా సార్స్-కొవ్-2 (56 గంటలు) ఆల్ఫా (191.3) బీటా (156.6) గామా (59.3) డెల్టా (114)తో పోలిస్తే ఒమిక్రాన్ 193.5 గంటలు జీవిస్తుంది. చర్మంపైనా దీని ఉనికి ఎక్కువ సమయమే ఉంటుంది. సార్స్ కొవ్-2, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వరుసగా 8.6, 19.6, 19.1, 11, 16.8 గంటలు బతికితే.. ఒమిక్రాన్ 21.1 గంటల వరకు చర్మంపై జీవించగలదు. అయితే ఒమిక్రాన్‌ను ఇథనాల్ సమర్థవంతంగా అడ్డుకుంటుందని పరిశోధకులు తేల్చారు. ఈ పరిశోధనను జపాన్‌లోని క్యోటో ప్రిఫెక్చురల్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసన్ శాస్త్రవేత్తలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్