భారత్‌తో చర్చలు నిర్మాణాత్మకం : చైనా

భారత్‌తో మిలటరీ స్థాయిలో తాము జరిపిన తాజా చర్చలు ‘సకారాత్మకం..నిర్మాణాత్మకం’గా సాగాయని, సరిహద్దు సమస్యల పరిష్కారానికి దిల్లీతో సన్నిహితంగా వ్యవహరిస్తామంటూ చైనా గురువారం ప్రకటించింది. పొరుగు దేశాలను తాము భయపెడుతున్నామన్న

Published : 28 Jan 2022 03:55 IST

అమెరికా ఆరోపణలు ఖండిస్తున్నాం

బీజింగ్‌: భారత్‌తో మిలటరీ స్థాయిలో తాము జరిపిన తాజా చర్చలు ‘సకారాత్మకం..నిర్మాణాత్మకం’గా సాగాయని, సరిహద్దు సమస్యల పరిష్కారానికి దిల్లీతో సన్నిహితంగా వ్యవహరిస్తామంటూ చైనా గురువారం ప్రకటించింది. పొరుగు దేశాలను తాము భయపెడుతున్నామన్న అమెరికా వ్యాఖ్యలు వాస్తవం కాదని ఖండించింది. జనవరి 12న ఇండియా, చైనాల నడుమ దళ కమాండర్ల స్థాయిలో 14వ విడత చర్చలు జరిగాయి. రెండు దేశాల నడుమ చర్చలు కొనసాగించాలని, ఉభయులకూ ఆమోదయోగ్యమైన రీతిలో దౌత్యపరమైన మార్గాల ద్వారా సహకరించుకోవాలని ఈ భేటీలో తీర్మానం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని