Virus: ఈ ద్రావణాన్ని పూస్తే... వస్త్రాలపై ఉండే వైరస్‌ ఖతం

వస్త్రాల ద్వారా కరోనా వైరస్‌ వ్యాపించకుండా ఉండేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియా శాస్త్రవేత్తలు సరికొత్త పదార్థాన్ని తయారు చేశారు. దీన్ని వస్త్రాలపై పూతగా వాడితే, కొవిడ్‌ ముప్పు 90% వరకూ తగ్గుతుందని వెల్లడించారు.

Updated : 12 Feb 2022 08:32 IST

టొరంటో: వస్త్రాల ద్వారా కరోనా వైరస్‌ వ్యాపించకుండా ఉండేందుకు యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియా శాస్త్రవేత్తలు సరికొత్త పదార్థాన్ని తయారు చేశారు. దీన్ని వస్త్రాలపై పూతగా వాడితే, కొవిడ్‌ ముప్పు 90% వరకూ తగ్గుతుందని వెల్లడించారు. పరిశోధకులు మొదట బ్యాక్టీరియాను నాశనంచేసే పాలిమర్‌ ద్రావణంలో వస్త్రాన్ని నానబెట్టారు. తర్వాత దీనిపై కాంతిని ప్రసరింపజేయగా, క్రిమిరహితంచేసే అణువులు విడుదలయ్యాయి. అనంతరం యూవీ కిరణాల సాయంతో ఈ ద్రావణం వస్త్రానికి గట్టిగా అతుక్కుపోయేలా చేశారు. ఈ పదార్థాన్ని మొదటిసారి ఉపయోగించినప్పుడు మాత్రమే కాకుండా... ఆ తర్వాత వస్త్రానికి సూర్యకాంతి తగిలినప్పుడు కూడా క్రిములు నాశనమవుతాయని పరిశోధనకర్త మైకేల్‌ వోల్ఫ్‌ వివరించారు. ‘‘సూక్ష్మక్రిములు వస్త్రానికి అతుక్కోకుండా చేసే ఈ పదార్థాన్ని తక్కువ ఖర్చుతోనే ఉత్పత్తి చేయవచ్చు. దీనివల్ల మనిషికి ఎలాంటి హానీ ఉండదు. కాటన్‌, పాలిస్టర్‌, సిల్క్‌, డెనిమ్‌ తదితర రకాలన్నింటికీ చాలా అనువుగా ఉంటుంది. ఆసుపత్రుల్లోని కర్టెన్లు, దుప్పట్లు, తలగడలు, మాస్కులకు కూడా ఈ ద్రావణాన్ని పూతగా వాడొచ్చు’’ అని పరిశోధకులు తెలిపారు. భవిష్యత్తులో సమర్థవంతమైన యాంటీవైరల్‌ స్ప్రేల తయారీకి ఈ పరిశోధన దోహదపడగలదని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని