Corona Virus: చిన్న పేగులను దెబ్బతీస్తున్న కరోనా

జీర్ణకోశంలోని ఆరోగ్యకర బ్యాక్టీరియాను కరోనా వైరస్‌ దెబ్బతీస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కొవిడ్‌-19తో మరణించినవారి చిన్న పేగుల నుంచి తీసిన నమూనాల పరిశీలనలో తేలింది. లండన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.

Updated : 22 Feb 2022 07:46 IST

లండన్‌: జీర్ణకోశంలోని ఆరోగ్యకర బ్యాక్టీరియాను కరోనా వైరస్‌ దెబ్బతీస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కొవిడ్‌-19తో మరణించినవారి చిన్న పేగుల నుంచి తీసిన నమూనాల పరిశీలనలో తేలింది. లండన్‌లోని కింగ్స్‌ కాలేజ్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.  

చిన్న పేగుల్లోని లింఫాయిడ్‌ కణజాలంలో ఆరోగ్యకర బ్యాక్టీరియా ఉంటాయి. కరోనా వైరస్‌ చిన్న పేగుల్లోకి ప్రవేశించపోయినా ఆరోగ్యకర బ్యాక్టీరియా నశించిపోతున్నట్లు పరిశోధకులు తెలిపారు. కొవిడ్‌-19 లక్షణాలు తీవ్రమైనప్పుడు అధిక జ్వరం, శ్వాసకోశ సమస్యలు తలెత్తే సంగతి తెలిసిందే. కొందరిలో నీళ్ల విరేచనాలు, వాంతులు సంభవిస్తాయి. దీన్నిబట్టి జీర్ణకోశాన్నీ కరోనా దెబ్బతీస్తోందని తేలుతోంది. వైరస్‌ వల్ల శరీరమంతటా రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినడం వల్లనే ఇలా జరుగుతోంది. చిన్నపేగుల పైపొరలోని లింఫాయిడ్‌ ఫాలికిల్స్‌లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఈ ఫాలికిల్స్‌ సమూహాన్ని పెయర్స్‌ ప్యాచెస్‌ అంటారు. ఆ ప్రాంతం మొత్తంలో పెనుమార్పులు వచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు. యాంటీబాడీ ఉత్పత్తి కణాలను పెంచే జెర్మినల్‌ కణాలు కూడా తగ్గిపోయాయని పేర్కొన్నారు. దీనివల్ల ఆ ప్రదేశంలో రోగనిరోధక శక్తి తగ్గుతోందని, అంతిమంగా అది సూక్ష్మజీవుల వైవిధ్యంపైనా ప్రభావం చూపుతున్నట్లు తేల్చారు. ఒకవేళ రోగి జీర్ణకోశం దెబ్బతింటే.. మున్ముందు నోటి ద్వారా తీసుకునే టీకాలు వచ్చినా అవి పనిచేయకపోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు