
Ukraine Crisis: పుతిన్ దురాక్రమణదారుడు
మండిపడ్డ బైడెన్
రష్యాపై తీవ్ర ఆంక్షలు
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు పుతిన్ ‘దురాక్రమణదారుడు’ అని, ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా ఆయన యుద్ధాన్నే ఎంచుకున్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మండిపడ్డారు. పుతిన్ అన్యాయమైన దాడికి పాల్పడినందుకు ప్రతిగా... మిత్ర దేశాలతో కలిసి రష్యాపై తీవ్ర ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన గురువారం అర్ధరాత్రి శ్వేతసౌధం వద్ద మాట్లాడారు. అంతకుముందు ఆయన జి-7 దేశాల అధినేతలతో వీడియో ద్వారా సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించారు. ‘‘రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచం ఏకమైంది. పుతిన్ ప్రాణాంతకమైన, మానవాళికి తీరని బాధను మిగిల్చే యుద్ధాన్ని ఎంచుకున్నారు. ఈ దాడుల ఫలితంగా చోటుచేసుకునే మరణాలకూ, విధ్వంసానికి రష్యాదే బాధ్యత. ఉక్రెయిన్‌పై అన్యాయమైన దాడి గురించి జి-7 దేశాల అధినేతలతో మాట్లాడాను. రష్యాపై వినాశకర కఠిన ఆర్థిక ఆంక్షలు విధించేందుకు మేమంతా అంగీకరించాం. ధీరులైన ఉక్రెయిన్ ప్రజలకు తోడుంటాం. రష్యా నుంచి సైబర్ దాడులు జరిగితే, వాటిని దీటుగా తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యాం. నాటో మిత్రదేశాలకు మరిన్ని ట్రూపుల సైన్యాన్ని పంపుతున్నాం. యావత్ ఐరోపాకూ ఇది ప్రమాదకర తరుణం. దురాక్రమణకు రష్యా చెప్పిన భద్రతా కారణాలు ఏమాత్రం హేతుబద్ధమైనవి కావు. అందుకే వినాశకర ఆంక్షలు విధిస్తున్నాం. అమెరికా, మిత్రదేశాలు కలిసి రష్యాకు చెందిన నాలుగు పెద్ద బ్యాంకులను స్తంభింపజేస్తాయి. ఆ దేశ ప్రముఖులకు సంబంధించిన ఎగుమతులపైనా, హైటెక్ రంగాలకు చెందిన పరిశ్రమలపైనా ఆంక్షలు విధిస్తాం. అమెరికా మిలటరీ సెమీ కండక్టర్లను నియంత్రిస్తాం. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకు నుంచి బ్యాంకుకు, రష్యా ఇంధన రంగానికి చెల్లింపులు జరిపేందుకు ఉపయోగపడే స్విఫ్ట్ చెల్లింపు వ్యవస్థ నుంచి రష్యాను తొలగిస్తాం’’ అని బైడెన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు అమెరికా దళాలను పంపుతారన్న వార్తలను ఆయన ఖండించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Rohit Sharma : రోహిత్ శర్మ.. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీల రికార్డు
-
General News
Hyderabad: వైభవంగా ప్రారంభమైన జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి శాకంబరి ఉత్సవాలు
-
India News
Mahua Moitra: ‘కాళీ’ వివాదం.. మహువాపై కేసు నమోదు..!
-
India News
Bhagwant Mann: రెండో వివాహం చేసుకోబోతోన్న సీఎం భగవంత్ మాన్!
-
Movies News
Archana: ‘మగధీర’లో అవకాశాన్ని అలా చేజార్చుకున్నా: అర్చన
-
Sports News
Joe root: కోహ్లీ,స్మిత్‌లను దాటేసిన రూట్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- Online Food delivery: ఆన్లైన్ Vs ఆఫ్‌లైన్: ఫుడ్ డెలివరీ దోపిడీని బయటపెట్టిన యూజర్.. పోస్ట్ వైరల్!
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- Health : పొంచి ఉన్న ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు!
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య