Taiwan: తైవాన్ భవితేంటి?
ఉక్రెయిన్‌పై రష్యా దాడితో తైవాన్ అంశంపైకి ప్రపంచ దేశాల దృష్టి మళ్లింది. తైవాన్‌కూ ఇలాంటి దుస్థితి ఎదురవుతుందా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. స్వయం పాలనలో ఉన్న ఆ దేశాన్ని తన కబ్జాలోకి తీసుకుంటానని డ్రాగన్ కొంతకాలంగా రంకెలు
రష్యా మార్గాన్ని చైనా అనుసరిస్తుందా?
ఈనాడు ప్రత్యేక విభాగం
ఉక్రెయిన్‌పై రష్యా దాడితో తైవాన్ అంశంపైకి ప్రపంచ దేశాల దృష్టి మళ్లింది. తైవాన్‌కూ ఇలాంటి దుస్థితి ఎదురవుతుందా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. స్వయం పాలనలో ఉన్న ఆ దేశాన్ని తన కబ్జాలోకి తీసుకుంటానని డ్రాగన్ కొంతకాలంగా రంకెలు వేస్తోంది. రష్యా చర్యను ఉదాహరణగా చూపుతూ.. చైనా కూడా దురాక్రమణకు దిగుతుందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. కొందరు నిపుణులు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. 1949లో చెలరేగిన అంతర్యుద్ధంతో చైనా, తైవాన్ విడిపోయాయి. ఈ చీలికను డ్రాగన్ గుర్తించడంలేదు. స్వాతంత్య్రాన్ని ఎక్కువగా ఇష్టపడే సాయ్ ఇంగ్ వెన్ 2016లో తైవాన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వివాదం తీవ్రమైంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ సైనిక ఒత్తిడిని పెంచింది. తమ దేశంలో విలీనం కావాల్సిందేనని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తైవాన్‌కు స్పష్టం చేస్తున్నారు.
సారూప్యతలు: రష్యాకు సరిహద్దున చిన్న దేశంగా ఉన్న ఉక్రెయిన్ తరహాలోనే చైనాకు తైవాన్ ఉంది. ఒకప్పుడు సొవియట్ యూనియన్‌లో ఉక్రెయిన్ భాగంకాగా తైవాన్ కూడా గతంలో చైనాలో అంతర్భాగంగానే ఉండేది. తైవాన్ సమీపంలోకి యుద్ధనౌకలు, యుద్ధవిమానాలను పంపుతూ చైనా భయాందోళనలు కలిగిస్తోంది. మంగళవారం చైనా సైన్యం తూర్పు చైనా సముద్రంలోని ఒక ప్రదేశంలో ల్యాండింగ్ విన్యాసాలను నిర్వహించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడంతో తమకూ అదే పరిస్థితి ఎదురుకానుందా అన్న ప్రశ్న తైవాన్ నాయకులను కలవరపెడుతోంది. సరిహద్దు దేశాలపై.. రష్యా అనుసరించే దురాక్రమణ విధానాలనే చైనా కూడా పాటిస్తుండటం వారి భయాలకు మరింత ఊతం ఇస్తోంది.
అమెరికా ఆదుకునేనా?
రష్యా నుంచి రక్షించడానికి ఉక్రెయిన్‌కు సైనిక బలగాలను పంపకూడదని అమెరికా నిర్ణయించింది. ఒకవేళ తైవాన్‌పై చైనా ఆక్రమణకు దిగినా అగ్రరాజ్యం స్పందన ఇలానే ఉంటుందా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. తైవాన్ తొలి నుంచి అమెరికాకు సన్నిహితంగా మెలుగుతోంది. అగ్రరాజ్యం నుంచి భారీగా ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉక్రెయిన్‌తో పోలిస్తే మెరుగ్గా ఉన్నట్లు తైవాన్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
* దీనికితోడు సెమీకండక్టర్ల ఉత్పత్తిలో తైవాన్ ముందంజలో ఉంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానం అమెరికాకు చాలా కీలకం. అందువల్ల తమ దేశం విషయంలో అగ్రరాజ్య స్పందన భిన్నంగా ఉండొచ్చని తైవాన్వాసులు భావిస్తున్నారు.
* ఇప్పట్లో తైవాన్‌పై సైనిక చర్యలకు దిగే ఆలోచన చైనాకు లేదని సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయ నిపుణుడు లి మిన్‌జియాంగ్ అంచనా వేశారు. అయితే ప్రస్తుత ఉక్రెయిన్- రష్యా పరిణామాలు డ్రాగన్ ఆలోచనలను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!