Ukraine Crisis: ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో మైళ్లకొద్దీ కార్ల బారులు

రష్యా దాడులతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్‌ నుంచి భారీ ఎత్తున ప్రజలు పొరుగు దేశాలకు తరలిపోతున్నారు. దీంతో పోలండ్‌లోని ఆ దేశ సరిహద్దుల్లో మైళ్ల కొద్దీ దూరం కార్లు బారులు తీరుతున్నాయి. ఇంతవరకు 1.20 లక్షల మంది ఉక్రెయిన్‌ నుంచి పోలండ్‌, ఇతర పొరుగు దేశాలకు వెళ్లిపోయినట్లు ఐక్యరాజ్య సమితి శరణార్థుల ఏజెన్సీ శనివారం తెలిపింది. ఇప్పటికే దాదాపు 20 లక్షల మంది ఉక్రెయిన్‌ వాసులు పోలండ్‌లో స్థిరపడ్డారు. కాగా గత 48 గంటల్లో లక్ష మందికి పైగా.. ఉక్రెయిన్‌ సరిహద్దులు దాటి వచ్చినట్లు పోలండ్‌ ప్రభుత్వం శనివారం వెల్లడించింది. మెడికా పట్టణ సరిహద్దు వద్ద మైళ్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి.

Updated : 27 Feb 2022 09:11 IST

భారీగా తరలిపోతున్న ప్రజలు
లక్ష మందికి పైగా పోలండ్‌లోకి..

మెడిక్‌ (పోలండ్‌): రష్యా దాడులతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్‌ నుంచి భారీ ఎత్తున ప్రజలు పొరుగు దేశాలకు తరలిపోతున్నారు. దీంతో పోలండ్‌లోని ఆ దేశ సరిహద్దుల్లో మైళ్ల కొద్దీ దూరం కార్లు బారులు తీరుతున్నాయి. ఇంతవరకు 1.20 లక్షల మంది ఉక్రెయిన్‌ నుంచి పోలండ్‌, ఇతర పొరుగు దేశాలకు వెళ్లిపోయినట్లు ఐక్యరాజ్య సమితి శరణార్థుల ఏజెన్సీ శనివారం తెలిపింది. ఇప్పటికే దాదాపు 20 లక్షల మంది ఉక్రెయిన్‌ వాసులు పోలండ్‌లో స్థిరపడ్డారు. కాగా గత 48 గంటల్లో లక్ష మందికి పైగా.. ఉక్రెయిన్‌ సరిహద్దులు దాటి వచ్చినట్లు పోలండ్‌ ప్రభుత్వం శనివారం వెల్లడించింది. మెడికా పట్టణ సరిహద్దు వద్ద మైళ్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. ఉక్రెయిన్‌ పశ్చిమ ప్రాంతంలోని చెర్నివ్ట్సీ నుంచి వచ్చిన ఓ కుటుంబం రొమేనియాలోకి వెళ్లేందుకు సరిహద్దులో దాదాపు 20 గంటలు నిరీక్షించింది. పోలండ్‌లోకి వెళ్లేందుకు తన నలుగురు పిల్లలతో బయల్దేరిన ఓ మహిళ బరువులు మోయలేక మార్గమధ్యంలోనే బ్యాగులు, ఆటవస్తువులు వంటివాటిని వదిలేసినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని