సౌదీలో ఒకేరోజు 81 మందికి మరణశిక్ష

హత్యలు, ఉగ్రవాదం వంటి నేరాలకు పాల్పడిన 81 మందికి (సౌదీలు 73 మంది, యెమన్లు ఏడుగురు, సిరియన్‌ ఒకరు) శనివారం సౌదీ అరేబియాలో సామూహికంగా మరణశిక్ష అమలు చేశారు. గల్ఫ్‌ రాజ్య ఆధునిక చరిత్రలో ఇదే అతిపెద్ద సామూహిక మరణశిక్షల అమలు చర్యగా చెప్పవచ్చు.

Updated : 13 Mar 2022 11:42 IST

దుబాయ్‌: హత్యలు, ఉగ్రవాదం వంటి నేరాలకు పాల్పడిన 81 మందికి (సౌదీలు 73 మంది, యెమన్లు ఏడుగురు, సిరియన్‌ ఒకరు) శనివారం సౌదీ అరేబియాలో సామూహికంగా మరణశిక్ష అమలు చేశారు. గల్ఫ్‌ రాజ్య ఆధునిక చరిత్రలో ఇదే అతిపెద్ద సామూహిక మరణశిక్షల అమలు చర్యగా చెప్పవచ్చు. 1979లో మక్కాలోని దివ్య మసీదును స్వాధీనం చేసుకున్నందుకు దోషులుగా తేలిన 63 మంది ఉగ్రవాదులకు 1980 జనవరిలో సామూహిక మరణశిక్ష అమలు చేశారు. ఇస్లాం మతానికి చెందిన పవిత్ర ప్రదేశంపై జరిగిన ఘోరమైన దాడిగా ఉగ్రవాదుల చర్య గుర్తుండిపోయింది. తాజాగా అంతకంటే ఎక్కువ సంఖ్యలో సామూహిక మరణశిక్షలను అమలు చేయడం గమనార్హం. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సౌదీ ప్రెస్‌ ఏజెన్సీ శనివారం తాజా మరణశిక్షల గురించి ప్రకటించింది. నిందితుల్లో కొందరు అల్‌ఖైదా, ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌ ఉగ్రవాదులతోపాటు యెమన్‌లోని హౌతి తిరుగుబాటు దళాల మద్దతుదారులు ఉన్నట్లు వెల్లడించింది. మరణశిక్షలు ఎక్కడ.. ఎలా అమలు చేశారన్న వివరాలు తెలుపలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని