రష్యాకు సాయం చేస్తే ఊరుకోం

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం క్రమంలో... అమెరికా, చైనాల నడుమ మాటలు ఘాటెక్కుతున్నాయి. పరస్పర ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. ఉక్రెయిన్‌పై దాడులకు సైనిక సామగ్రి, ఆయుధాలు అందించాలని రష్యా చైనాను అభ్యర్థించినట్టు కథనాలొస్తున్న క్రమంలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జాక్‌ సులివన్‌ సోమవారం  మండిపడ్డారు. పలు దేశాలు

Published : 15 Mar 2022 05:08 IST

చైనాను హెచ్చరించిన అమెరికా

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం క్రమంలో... అమెరికా, చైనాల నడుమ మాటలు ఘాటెక్కుతున్నాయి. పరస్పర ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. ఉక్రెయిన్‌పై దాడులకు సైనిక సామగ్రి, ఆయుధాలు అందించాలని రష్యా చైనాను అభ్యర్థించినట్టు కథనాలొస్తున్న క్రమంలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జాక్‌ సులివన్‌ సోమవారం  మండిపడ్డారు. పలు దేశాలు విధించిన ఆంక్షలను ఎగవేసేలా రష్యాకు సహాయపడవద్దని హెచ్చరించారు. రష్యా దండయాత్ర నేపథ్యంలో అమెరికా, చైనా ప్రతినిధులు రోమ్‌లో భేటీ అవుతున్నారు. అమెరికా తరఫున సులివన్‌, చైనా తరఫున ఆ దేశ విదేశాంగ విధాన సలహాదారుడు యాంగ్‌ జీచీ హాజరయ్యారు. భేటీకి ముందు సులివన్‌ విలేకరులతో మాట్లాడారు. రష్యా యుద్ధంచేసే విషయం చైనాకు ముందే తెలుసని ఆరోపించారు.‘‘ఆంక్షలను ఎగవేసేందుకుగానీ, ఆంక్షల కారణంగా ఏర్పడే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకుగానీ రష్యాకు చైనా తోడ్పడితే సహించం. ఇందుకు డ్రాగన్‌ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని సులివన్‌ తేల్చిచెప్పారు. సులివన్‌ హెచ్చరికలపై చైనా స్పందించింది. తమ నుంచి రష్యా సాయం కోరలేదని వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి లీ పెంగ్యూ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని