Corona Virus: కొవిడ్‌ కారక దీర్ఘకాల నొప్పులకు కారణం ఇదే...

కరోనా బాధితుల్లో దీర్ఘకాల నొప్పులు, ఇతరత్రా రుగ్మతలు తలెత్తడానికి దారితీస్తున్న పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. మౌంట్‌ సీనాయ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ మేరకు పరిశోధన సాగించారు. మహమ్మారి కారణంగా చాలామంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను

Updated : 06 Apr 2022 06:55 IST

అమెరికా శాస్త్రవేత్తల పరిశోధన

వాషింగ్టన్‌: కరోనా బాధితుల్లో దీర్ఘకాల నొప్పులు, ఇతరత్రా రుగ్మతలు తలెత్తడానికి దారితీస్తున్న పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. మౌంట్‌ సీనాయ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ మేరకు పరిశోధన సాగించారు. మహమ్మారి కారణంగా చాలామంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా శరీరంలో అంతర్గత నొప్పులు, ఇంద్రియాలు అసాధారణంగా పనిచేయడం వంటి సమస్యలు వీరిలో తలెత్తుతున్నాయి. పరిశోధకులు... శరీర నొప్పి ప్రసారక వ్యవస్థలో కరోనా వైరస్‌కు సంబంధించిన జీవరసాయనాల మార్పులు ఏ విధంగా చోటుచేసుకుంటున్నాయన్నది పరిశీలించారు. ఇందుకు వారు ఆర్‌ఎన్‌యే సీక్వెన్సింగ్‌ను ఉపయోగించి ఎలుకలపై పరిశోధన సాగించారు. శరీరం నుంచి వైరస్‌ వీడిన తర్వాత కూడా న్యూరాన్ల సమూహం (డోర్సల్‌ రూట్‌ గాంగ్లియా)లో ఇన్‌ఫెక్షన్‌ సంబంధిత జన్యు సంకేతాలు ఉనికి చాటుకుంటున్నట్టు వారు గుర్తించారు. ఇతరత్రా సమస్యలతో శరీరంలో నొప్పులు తలెత్తినప్పుడు కనిపించే జన్యు సంకేతాలతో ఇవి సరిపోలుతున్నట్టు నిర్ధారణకు వచ్చారు. ఎక్కువ రోజులు కొవిడ్‌తో బాధపడుతున్న వారికి, వైరస్‌ అనంతరం నొప్పులతో సతమతమయ్యే వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఈ పరిశోధన దోహదపడగలదని నిపుణులు భావిస్తున్నారు. బాధితుల ఆరోగ్యంపై కొవిడ్‌ దీర్ఘకాల ప్రభావం చూపుతున్నట్టు తమ పరిశోధన ద్వారా నిరూపితమైందని, జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెబుతోందని పరిశోధనకర్త రందాల్‌ సెరాఫినీ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని