ఉక్రెయిన్‌లో హత్యలను ఖండించిన భారత్‌

ఉక్రెయిన్‌లో పౌరులను అత్యంత అమానుషంగా హత్య చేస్తున్నారన్న నివేదికలపై ఐరాస భద్రతా మండలిలో భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలన్న ప్రతిపాదనకు మద్దతు తెలిపింది. ఈ మేరకు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్‌.తిరుమూర్తి

Published : 06 Apr 2022 04:52 IST

స్వతంత్ర దర్యాప్తునకు ఐరాస భద్రతా మండలిలో మద్దతు

ఐరాస: ఉక్రెయిన్‌లో పౌరులను అత్యంత అమానుషంగా హత్య చేస్తున్నారన్న నివేదికలపై ఐరాస భద్రతా మండలిలో భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలన్న ప్రతిపాదనకు మద్దతు తెలిపింది. ఈ మేరకు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్‌.తిరుమూర్తి మంగళవారం మాట్లాడారు. ‘‘బుచా ప్రాంతంలోని అమాయక పౌరులను కిరాతకంగా హతమార్చారన్న నివేదికలతో తీవ్రంగా కలత చెందాం. నిస్సందేహంగా వీటిని ఖండిస్తున్నాం. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నాం. దౌత్యం ద్వారా సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఉక్రెయిన్‌కు అంతర్జాతీయ సమాజం మానవతా సాయాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నాం. ముఖ్యంగా అత్యవసర ఔషధాలను అక్కడకు చేరవేయాల్సి ఉంది’’ అని తిరుమూర్తి పేర్కొన్నారు. బుచాలో పౌరుల హత్యకు సంబంధించిన భయానక చిత్రాలను తాను ఎన్నటికీ మరువలేనని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ పేర్కొన్నారు. అక్కడ ఇప్పుడు అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువవుతుండటం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని