Sri Lanka Crisis: తప్పులు చేశాం.. సంక్షోభానికి కారణమయ్యాం

తన రాజీనామా కోసం ప్రజల నుంచి పెద్దఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతుండటంతో శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స వైఖరిలో కొంత మార్పు కనిపిస్తోంది. తాము చేసిన తప్పులు దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాయని

Updated : 20 Apr 2022 05:11 IST

అంగీకరించిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ  
వాటిని సరిదిద్దుకుంటామని ప్రతిన

కొలంబో, వాషింగ్టన్‌: తన రాజీనామా కోసం ప్రజల నుంచి పెద్దఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతుండటంతో శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స వైఖరిలో కొంత మార్పు కనిపిస్తోంది. తాము చేసిన తప్పులు దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాయని తాజాగా ఆయన అంగీకరించారు. వాటిని సరిదిద్దుకుంటామని ప్రతినబూనారు. కొత్తగా నియమితులైన 17 మంది కేబినెట్‌ మంత్రులను ఉద్దేశించి గొటబాయ సోమవారం ఈ మేరకు ప్రసంగించారు.  

అధ్యక్షుడి అధికారాల్లో కోత!

సంక్షోభ నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైనందుకు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స పార్లమెంటులో మంగళవారం కీలక ప్రతిపాదన చేశారు. దేశాధ్యక్షుడి అధికారాల్లో కోత విధిస్తూ, పార్లమెంటు సాధికారతను పెంచేందుకు గతంలో రాజ్యాంగానికి చేసిన 19(ఎ) సవరణను అవసరమైన మార్పులతో పునరుద్ధరించాలనుకుంటున్నట్లుచెప్పారు. మరోవైపు.. ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకుగాను తమకు సత్వరం ఆర్థిక సహాయం చేయాలంటూ ఐఎంఎఫ్‌కు శ్రీలంక విజ్ఞప్తి చేసింది.    

లీటరు పెట్రోల్‌ రూ.338

ధరల పెరుగుదలతో ఇప్పటికే తీవ్రంగా ఇబ్బందిపడుతున్న లంకేయులపై తాజాగా ఇంధన రేట్ల పిడుగు పడింది. ఆ దేశంలో లీటరు పెట్రోల్‌ ధర రూ.338కి చేరుకుంది.

పోలీసుల కాల్పులు.. ఒకరి మృతి

పెట్రోల్‌ ధరల పెంపును వ్యతిరేకిస్తూ నైరుతి శ్రీలంకలోని రాంబుక్కన ప్రాంతంలో నిరసన ప్రదర్శన చేపట్టినవారిపై పోలీసులు మంగళవారం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. 12 మంది గాయపడ్డారు.

అన్నివిధాలా అండగా నిలుస్తాం: భారత్‌

శ్రీలంకకు అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భారత్‌ మరోసారి హామీ ఇచ్చింది. ఐఎంఎఫ్‌, ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకుగాను వాషింగ్టన్‌ వెళ్లిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. లంక ఆర్థిక మంత్రి సబ్రీతో భేటీ అయ్యారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని