Imaran Khan: ఇమ్రాన్‌ హెలికాప్టర్‌ ఖర్చు రూ.40 కోట్లు

పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ తన ప్రభుత్వ హయాంలో ప్రధాని నివాసం నుంచి బానీ గాలాలోని ప్రయివేటు ఆవాసానికి 15 కిలోమీటర్ల దూరం హెలికాప్టర్‌ ద్వారా సాగించిన రాకపోకల ఖర్చు రూ.40 కోట్లు (984 మిలియన్ల పాకిస్థానీ రూపాయలు).

Published : 22 Apr 2022 06:53 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ తన ప్రభుత్వ హయాంలో ప్రధాని నివాసం నుంచి బానీ గాలాలోని ప్రయివేటు ఆవాసానికి 15 కిలోమీటర్ల దూరం హెలికాప్టర్‌ ద్వారా సాగించిన రాకపోకల ఖర్చు రూ.40 కోట్లు (984 మిలియన్ల పాకిస్థానీ రూపాయలు). పాక్‌ సమాచారశాఖ మంత్రి మరియం ఔరంగజేబ్‌ గురువారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇమ్రాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 2018 జూన్‌ నుంచి 2022 మార్చి వరకు ఈ మొత్తం ఖర్చు పెట్టినట్లు వివరించారు. ఇందులో ప్రయాణ ఖర్చు 472 మిలియన్లు కాగా, నిర్వహణకు 512 మిలియన్లు వెచ్చించారు.

* ప్రభుత్వానికి అందిన కానుకల విషయంలోనూ కేవలం 20 శాతం డబ్బు కట్టి, రూ.5.7 కోట్లు (142 మిలియన్‌ రూపాయలు) ఇమ్రాన్‌ సొమ్ము చేసుకున్నారని మరియం ఔరంగజేబ్‌ మీడియాకు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని