ప్రపంచ పెద్దమ్మ కన్నుమూత.. 119 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన కానే ఠనాకా

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా గిన్నిస్‌ పుస్తకంలో చోటు సంపాదించిన కానే ఠనాకా 119వ ఏట కన్నుమూశారు. నైరుతి జపాన్‌లోని ఫుకోకా పట్టణానికి చెందిన ఆమె ఈ నెల 19న తుదిశ్వాస విడిచారని జపాన్‌

Updated : 26 Apr 2022 07:36 IST

టోక్యో: ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా గిన్నిస్‌ పుస్తకంలో చోటు సంపాదించిన కానే ఠనాకా 119వ ఏట కన్నుమూశారు. నైరుతి జపాన్‌లోని ఫుకోకా పట్టణానికి చెందిన ఆమె ఈ నెల 19న తుదిశ్వాస విడిచారని జపాన్‌ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. 2019 మార్చి నెలలో గిన్నిస్‌ సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా కానేను గుర్తించింది. అప్పటికి ఆమెకు 116 ఏళ్లు. అలాగే 2020 సెప్టెంబరులో అత్యంత ఎక్కువ కాలం జీవించిన జపాన్‌ వ్యక్తిగా కానే రికార్డు సృష్టించారు. అప్పటికి ఆమె వయసు 117 సంవత్సరాల 261 రోజులు. ప్రపంచంలోనే సుదీర్ఘ కాలం బతికిన రెండో వ్యక్తిగా కూడా ఆమె రికార్డులకు ఎక్కారు. రైట్‌ సోదరులు విమానాన్ని కనిపెట్టిన 1903వ సంవత్సరంలో జనవరి రెండో తేదీన కానే జన్మించారు. 1922లో 19వ ఏట హిడియో ఠనాకా అనే వ్యక్తిని పెళ్లాడారు. ఈ దంపతులకు నలుగురు సంతానం. మరొకరిని దత్తత తీసుకున్నారు. 1937లో రెండో చైనా-జపాన్‌ యుద్ధంలో పాల్గొనేందుకు భర్త, పెద్ద కుమారుడు వెళ్లిన సమయంలో.. కానే నూడుల్స్‌ దుకాణం నడిపారు. సోడా, చాక్లెట్‌ సహా రుచికరమైన ఆహారం తీసుకోవడం, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండడమే తన సుదీర్ఘ ఆయువుకు కారణమని కానే చెప్పేవారు. ఠనాకా మృతితో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా ఫ్రాన్స్‌ మహిళ లుసిలీ రాండన్‌ నిలిచారు. ఆమె వయసు 118 సంవత్సరాల 73 రోజులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు