పాక్‌లో చైనీయులపై మరో దాడి

పాకిస్థాన్‌లో మరోసారి చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. కరాచీ యూనివర్శిటీలో మంగళవారం బుర్ఖా ధరించిన ఓ మహిళ తనను తాను పేల్చుకుంది. ఈ ఘటనలో ముగ్గురు చైనీయులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

Published : 27 Apr 2022 05:26 IST

పేలుడులో ముగ్గురు డ్రాగన్‌ దేశస్థులు, పాక్‌ డ్రైవరు మృతి

కరాచీ: పాకిస్థాన్‌లో మరోసారి చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. కరాచీ యూనివర్శిటీలో మంగళవారం బుర్ఖా ధరించిన ఓ మహిళ తనను తాను పేల్చుకుంది. ఈ ఘటనలో ముగ్గురు చైనీయులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు మహిళలు, పాక్‌కు చెందిన వ్యాను డ్రైవరు ఒకరు ఉన్నారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ దాడి తమ పనేనని నిషేధిత బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రకటించింది. యూనివర్సిటీలో స్థానిక విద్యార్థులకు చైనీస్‌ భాషను బోధించే కన్ఫూసియస్‌ ఇన్‌స్టిట్యూట్‌ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులను చైనాకు చెందిన బోధన సిబ్బంది హువాంగ్‌ గ్విపింగ్‌, డింగ్‌ ముపెంగ్‌, చెన్‌సా, పాక్‌ జాతీయుడైన వ్యాను డ్రైవరు ఖలీద్‌గా అధికారులు గుర్తించారు. ఖలీద్‌ వారిని వసతి గృహం నుంచి ఇన్‌స్టిట్యూట్‌ వద్దకు వ్యానులో తీసుకురాగానే, అక్కడ మాటువేసి ఉన్న మహిళ తనను తాను పేల్చుకుందని అధికారులు తెలిపారు. గతంలోనూ చైనీయులను లక్ష్యంగా చేసుకుని పాక్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్సు, కరాచీల్లో వేర్పాటువాదులు దాడులకు పాల్పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని