Updated : 29 Apr 2022 05:57 IST

Ukraine Crisis: 3,300 కోట్ల డాలర్ల సాయానికి కాంగ్రెస్‌ అనుమతి కోరిన బైడెన్‌

వాషింగ్టన్‌: రష్యా దురాక్రమణ యత్నాన్ని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌కు మరో 3,300 కోట్ల డాలర్ల సాయం అందించడానికి అనుమతించాలని అమెరికన్‌ కాంగ్రెస్‌ను దేశాధ్యక్షుడు జో బైడెన్‌ కోరారు. ఉక్రెయిన్‌కు మరింత కాలం సాయమందించే ఉద్దేశం అమెరికాకు ఉందన్న సంకేతాన్ని ఆయన వెలువరించారు. సైనిక అవసరాలను తీర్చుకోవడంతో పాటు ఆర్థిక, మానవతా సాయానికి ఈ మొత్తం ఉపకరిస్తుందని చెప్పారు. గత నెలలో 1,360 కోట్ల డాలర్ల సాయానికి ఆమోదం లభించగా ఆ మొత్తమంతా దాదాపు ఖర్చయిపోయింది. రష్యా కుబేరుల ఆస్తుల్ని జప్తు చేయడానికి, వాటి అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఉక్రెయిన్‌కు సాయంగా వాడేందుకు అనుమతించాలని కాంగ్రెస్‌ను బైడెన్‌ తాజాగా కోరారు.

తప్పుడు సమాచారం వెనుక రష్యా ఉందంటున్న సర్వే
యుద్ధం విషయంలో ఎక్కువగా తప్పుడు సమాచారమే చలామణిలో ఉంటోందని అమెరికాలో వయోజనులు భావిస్తున్నట్లు అసోసియేటెడ్‌ ప్రెస్‌ సర్వేలో బయటపడింది. రష్యా ఉద్దేశపూర్వకంగానే దీనికి పాల్పడుతోందని 61% మంది అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్‌లో నేరాలకు పాల్పడాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది పుతిన్‌ అని 57% మంది చెప్పారు.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts