
Corona Virus: చిన్నారుల్లో తీవ్ర కొవిడ్‌కు కారణాలివే!
మెల్బోర్న్: కొంతమంది చిన్నారులు తీవ్ర కొవిడ్-19 బారినపడటానికి కారణాలను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ రుగ్మతను చాలా త్వరగా గుర్తించడానికి, మరింత మెరుగైన ఔషధాలను అభివృద్ధి చేయడానికి ఇది మార్గం సుగమం చేస్తుందని వారు తెలిపారు.
తీవ్ర కొవిడ్ బారినపడ్డ చిన్నారుల్లో మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ తలెత్తుతుంది. ఫలితంగా గుండె, ఊపిరితిత్తులు, మెదడులో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అలాగే రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అనే ఒకరకం ఊపిరితిత్తుల వ్యాధి కూడా ఉత్పన్నం కావొచ్చు. ‘‘చిన్నారులకు సాధారణంగా కొవిడ్ ముప్పు తక్కువ. వారిలో స్వల్పస్థాయి లక్షణాలే కనిపిస్తాయి. అయితే కొందరిలో వ్యాధి తీవ్రరూపం దాల్చడానికి కారణాలపై అస్పష్టత నెలకొంది. రక్తం గడ్డకట్టడం, రోగనిరోధక వ్యవస్థలోని ప్రొటీన్ల చర్యా క్రమం ఇందుకు కారణమవుతున్నట్లు మేం గుర్తించాం’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న మెక్క్యాఫెటీ పేర్కొన్నారు. తీవ్ర కొవిడ్ బారినపడ్డ పిల్లల్లో ఉత్పన్నమైన మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ లక్షణాలు కవాసాకి వ్యాధి, టాక్సిక్ షాక్ సిండ్రోమ్ బాధితుల్లో కనిపించే లక్షణాలను పోలి ఉంటున్నాయని వివరించారు. వీరిలో జ్వరం, కడుపులో నొప్పి, వాంతులు, చర్మంపై దద్దుర్లు, కళ్లకు ఇన్ఫెక్షన్లు వంటివి ఉన్నాయని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26-06-2022)
-
World News
Padma Bridge: బంగ్లాదేశ్‌లోనే పొడవైన వంతెన ప్రారంభం.. విశేషాలివే!
-
India News
Amit Shah: శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19ఏళ్లు వేదన అనుభవించారు..!
-
Sports News
IND vs IRL: పసికూనతో పోటీ.. టీమ్ఇండియా ఫేవరెటే అయినా..!
-
Movies News
Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
-
General News
Flipkart MoU: సెర్ప్‌తో ఫ్లిప్‌కార్ట్ ఒప్పందం.. మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో సంతకాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న చేతికొచ్చే వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్‌ఖాన్‌ని వదులుకున్నా!
- Lifestyle: అందమైన భార్య పక్కన ఉన్నా స్పందన లేదా?
- కలకలం రేపిన ఐఏఎస్ కుమారుడి మృతి.. అధికారులే హత్య చేశారన్న కుటుంబీకులు!
- Teesta Setalvad: ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ అరెస్టు
- Amaravathi: రాజధాని భూముల అమ్మకం
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Crime News : ఆ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు.. చూస్తే షాకే