Updated : 05 May 2022 08:54 IST

Corona Virus: త్వరలో మళ్లీ కొవిడ్‌ ఉద్ధృతి.. డెల్టా లేదా మరో కొత్త వేరియంట్‌ వల్లే!

ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తల తాజా పరిశోధన

జెరూసలేం: కరోనా వైరస్‌ త్వరలోనే మళ్లీ ఉగ్రరూపం దాల్చవచ్చని... డెల్టా లేదా మరో కొత్త వేరియంటే ఇందుకు కారణమవుతుందని ఇజ్రాయెల్‌ పరిశోధకులు హెచ్చరించారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉపరకాలు వచ్చే రెండు మూడు నెలల్లో వాటంతట అవే కనుమరుగవుతాయని కూడా వారు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు బెన్‌-గురియన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజా పరిశోధన సాగించారు. ఇందులో భాగంగా బీర్‌-షెవా నగరంలోని మురుగునీటిని సేకరించిన పరిశోధకులు... వాటిలోని ఒమిక్రాన్‌, డెల్టా వేరియంట్ల మధ్య పరస్పర చర్యలు జరుగుతున్నట్టు ప్రత్యేక నమూనా సాయంతో గుర్తించారు. ‘‘డెల్టా వేరియంట్‌ అంతకు ముందున్న వైరస్‌ రకాలను తుడిచిపెట్టేసింది. దాని తర్వాత వచ్చిన ఒమిక్రాన్‌ మాత్రం డెల్టాను ఏమీ చేయలేకపోయింది. త్వరలోనే ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లు వాటంతట అవే తెరమరుగయ్యే అవకాశముంది. డెల్టా మాత్రం రహస్యంగా తన వ్యాప్తిని కొనసాగిస్తూ మరింత శక్తిమంతంగా మారవచ్చు. లేదంటే కొత్త వేరియంట్‌కు దారితీయవచ్చు. డామినెంట్‌ వేరియంట్లు ఎప్పుడూ వాటి కంటే ముందున్న వైరస్‌ల కంటే శక్తిమంతంగానే ఉంటాయి. ఆ ప్రకారం చూస్తే... డెల్టా లేదా మరో కొత్త వేరియంట్‌ కారణంగా మరోసారి కొవిడ్‌ ఉద్ధృతి తప్పకపోవచ్చని భావిస్తున్నాం’’ అని పరిశోధనకర్త ఏరియెల్‌ కుష్మారో వివరించారు. ‘సైన్స్‌ ఆఫ్‌ ద టోటల్‌ ఎన్విరాన్‌మెంట్‌’ పత్రిక ఈ వివరాలు అందించింది.

Read latest World News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని