
Ukraine Crisis: మస్క్‌వా మునక వెనుక అమెరికా
వాషింగ్టన్: రష్యా నౌకాదళంలోనే అత్యంత ప్రముఖమైన మస్క్‌వా యుద్ధనౌక నల్ల సముద్రంలో మునగడం వెనుక అమెరికా హస్తం ఉందన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. నేరుగా అమెరికా ఈ ఆపరేషన్‌లో పాల్గొనకపోయినా, పూర్తి సహకారమివ్వడాన్ని రష్యా ఎలా తీసుకుంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్ 14న మస్క్‌వా నల్ల సముద్రంలో మునిగిపోయింది. తమ నెప్ట్యూన్ క్షిపణుల దాడి కారణంగానే అది మునిగిందని ఉక్రెయిన్ ప్రకటించింది. దీన్ని రష్యా తీవ్రంగా ఖండించింది. నౌకలో అంతర్గతంగా ప్రమాదం జరిగిందని, ఎలాంటి క్షిపణిదాడి జరగలేదని పేర్కొంది. అగ్నికీలలు అంటుకున్న సమయంలో 500 మంది సైనిక సిబ్బంది ఆ నౌకలో ఉన్నారు. ఇందులో ఎంత మంది మరణించారు, ఎంత మందికి గాయాలయ్యాయన్న విషయాన్ని మాస్కో పేర్కొనలేదు. రెండో ప్రపంచయుద్ధం తర్వాత రష్యాకు చెందిన అతి పెద్ద యుద్ధనౌక మునిగిపోవడం ఇదే తొలిసారి. ఇది పుతిన్‌సేనకు సైనికపరంగా ఎదురుదెబ్బ. మునక వెనుక తమ నిఘా వర్గాలు కీలక పాత్ర పోషించాయని అమెరికా ఇప్పుడు చెబుతోంది. ‘‘మస్క్‌వా ఎక్కడుందని ఉక్రెయిన్ సైనిక అధికారులు అడిగారు. నల్లసముద్రంలో దక్షిణ ఒడెస్సాకు సమీపంలో ఉందని చెప్పాం. ఆ సమాచారాన్నీ అందించాం’’ అని ఓ అమెరికా అధికారి తెలిపారు. ఆ సమాచారంతోనే ఉక్రెయిన్ క్షిపణి దాడికి పాల్పడింది. మస్క్‌వాను ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకుందన్న విషయం తమకు నిజంగా తెలియదని, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి నిఘా సమాచారం అందిస్తున్నామని, అందులో భాగంగానే మస్క్‌వా ఆనుపానులనూ అందించామని అమెరికా నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Chandrakant Pandit: మధ్యప్రదేశ్ కెప్టెన్ పెళ్లికి రెండు రోజులే సెలవిచ్చా: చంద్రకాంత్ పండిత్
-
Crime News
Hyd News: చీకటి గదిలో బంధించి చిత్రహింసలు.. కొడుకు, కోడలిపై వృద్ధ దంపతుల న్యాయపోరాటం
-
General News
GHMC: విధుల్లో నిర్లక్ష్యంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆగ్రహం.. 38 మంది ఇంజినీర్ల జీతాల్లో కోత
-
Movies News
Bunny Vas: ఓటీటీలో సినిమాల విడుదలపై నిర్మాత బన్నీవాసు కీలక వ్యాఖ్యలు
-
World News
Editors Guild: మహ్మద్ జుబైర్ అరెస్టును ఖండించిన ఎడిటర్స్ గిల్డ్
-
India News
ONGC: అరేబియా సముద్రంపై ఓఎన్జీసీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- నాకు మంచి భార్య కావాలి!
- ఆవిష్కరణలకు అందలం
- Usa: అమెరికాలో వలస విషాదం : ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాలు..!
- Mohan Babu: తిరుపతి కోర్టుకు నటుడు మోహన్‌బాబు
- ఔరా... అనేల
- IND vs ENG: బుమ్రాకు అరుదైన అవకాశం?
- Ts Inter results 2022: ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. క్లిక్ చేసి రిజల్ట్ చూసుకోండి..