జన్యుపరమైన కారణాలతోనే వృద్ధుల్లో కొవిడ్‌ తీవ్రరూపం!

వృద్ధుల్లో కరోనా మహమ్మారి ఎక్కువ ప్రభావం చూపుతుండటానికి జన్యుపరమైన అంశాలే కారణమని పరిశోధకులు తాజాగా గుర్తించారు. సాధారణంగా శరీరం రోగనిరోధక కణాలను ఎంత వేగంగా వృద్ధి చేసుకుంటుందన్నదానిపైనే.. కొవిడ్‌ సహా ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌నైనా

Published : 10 May 2022 05:43 IST

వాషింగ్టన్‌: వృద్ధుల్లో కరోనా మహమ్మారి ఎక్కువ ప్రభావం చూపుతుండటానికి జన్యుపరమైన అంశాలే కారణమని పరిశోధకులు తాజాగా గుర్తించారు. సాధారణంగా శరీరం రోగనిరోధక కణాలను ఎంత వేగంగా వృద్ధి చేసుకుంటుందన్నదానిపైనే.. కొవిడ్‌ సహా ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌నైనా మనం ఎంత సమర్థంగా ఎదుర్కొంటామన్నది ఆధారపడి ఉంటుంది. వయోభారం మీదపడేకొద్దీ ఆ కణాలను త్వరితగతిన అభివృద్ధి చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుంటుందని అమెరికాలోని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఓ అధ్యయనంలో గుర్తించారు. ‘‘కణ విభజన జరిగినప్పుడల్లా డీఎన్‌ఏ ముక్కలవుతుంది. దాని చివర ఉండే టెలోమియర్‌ ప్రతి విభజనతో మరింత పొట్టిగా మారుతుంది. ఒకానొక దశలో అది మరీ పొట్టిగా అయిపోయి.. విభజన ఆగిపోతుంది. అన్ని కణాల్లో కాకుండా, మానవుల రోగనిరోధక కణాల్లోనే ఈ పరిమితి కనిపిస్తోంది’’ అని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ తెలిపారు. ఇలాంటి పరిమితి ఉన్నప్పటికీ సగటు వ్యక్తుల్లో రోగనిరోధక వ్యవస్థ 50 ఏళ్ల వరకూ బాగానే పనిచేస్తోందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని